S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/16/2017 - 01:49

హైదరాబాద్, ఆగస్టు 15: ప్రపంచంలోనే అగ్రగామి వర్శిటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రూపుదిద్దుకుందని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు పేర్కొన్నారు. ప్రపంచంలో అగ్రగామి వంద వర్శిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కూడా చేరిందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు 71వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు.

08/16/2017 - 01:48

హైదరాబాద్, ఆగస్టు 15: నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను క్రమంగా లాభాల బాటలో నడిపిస్తామని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. టిఎస్‌ఆర్టీసీకి ఇప్పటికే దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, ఈ సంస్థలో తాను చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా జివి రమణరావు ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. మంగళవారం బస్‌భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

08/16/2017 - 01:46

హైదరాబాద్, ఆగస్టు 15: పోలీసులు ఇప్పటి వరకు సీఎం, విఐపి, వివిఐపిలకు భద్రతలో భాగంగా డాగ్‌స్క్వాడ్‌ను కూడా వినియోగించేవారు. తాజాగా డాగ్‌స్క్వాడ్‌ను డ్రగ్స్ పెడలర్స్‌ను పట్టుకునేందుకు కూడా డాగ్‌స్క్వాడ్‌ను వినియోగించాలని పోలీస్ శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగానే డ్రగ్స్ సరఫరా, వినియోగదారులను పసి కట్టేందుకు జర్మన్ షెపర్డ్ పప్పీస్‌ను కొనుగోలు చేసింది.

08/16/2017 - 01:44

హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై పోలీస్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. అక్రమ వలసదారులు మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల సరఫరా, విధ్వంసాలకు పాల్పడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని, దీంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు అక్రమ వలసదారులపై దృష్టి సారించారు.

08/16/2017 - 01:43

హైదరాబాద్, ఆగస్టు 15: లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి అని విపక్షాలు ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లక్ష కాదు లక్షా 12వేల 536 ఉద్యోగాలు ఇస్తున్నాం ఇదిగో అంటూ లెక్క చెప్పారు. ఇప్పటి వరకు 27,660 ఉద్యోగాల నియామకాలు జరిగాయి. 36,806 ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి. 48,070 ఉద్యోగాల నియామకాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

08/15/2017 - 23:13

హైదరాబాద్, ఆగస్టు 15: బొగ్గురేట్లు తగ్గడంతో ఆ మేర మిగిలిన ఆదాయంతో రాష్ట్రంలో నెలకు వంద యూనిట్ల లోపు విద్యుత్‌ను వినిమయం చేసే వారికి టారిఫ్‌ను తగ్గించే ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం బొగ్గుపై జిఎస్‌టిని ఐదు శాతానికి తగ్గించింది. దీని వల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై రూ. 150 కోట్ల మేర భారం తగ్గింది.

08/15/2017 - 23:12

హైదరాబాద్, ఆగస్టు 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ 70 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని ఎంతో అభివృద్ధి దిశగా నడిపించిందని చెప్పారు.

08/15/2017 - 03:53

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: దేశంలోనే తెలంగాణ పోలీసుల పనితీరు భేష్‌గా ఉందని, ఇది తాను ఇస్తున్న కితాబు కాదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగంగా తెలిపారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలలో ఆయన పర్యటించారు.

08/15/2017 - 03:50

నల్లగొండ, ఆగస్టు 14: కృష్ణమ్మ పరవళ్లు నారాణయణపూర్, అల్మట్టి ప్రాజెక్టుల వరకే ఆగిపోతుండడంతో తెలంగాణ పరిధిలో ఈ ఏడాది కృష్ణమ్మ సవ్వడుల జాడ కానరాక నాగార్జునసాగర్ రిజర్వాయర్ అడుగంటిపోతూ సాగు, తాగునీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతోంది.

08/15/2017 - 03:50

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ నట్టేట ముంచుతున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Pages