S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/15/2017 - 02:29

హైదరాబాద్, ఆగస్టు 14: హైదరాబాద్‌లో నకిలీ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది. నకిలీ సర్ట్ఫికెట్ల తయారీకి పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా డిగ్రీ సర్ట్ఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు.

08/15/2017 - 02:27

హైదరాబాద్, ఆగస్టు 14: గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి, వ్యవసాయ శాఖలో విలీనం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తక్షణమే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో 62శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున ఈ ఆలోచన సరైనది కాదని అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

08/15/2017 - 02:26

హైదరాబాద్, ఆగస్టు 14: ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగ , ఉపాధి అవకాశాల్లో వస్తున్న పెనుమార్పులకు అనుగుణంగా పాండిచ్చేరిలోని అరోణ్య విద్యాసంస్థ భవిష్యత్ తరాల సవాళ్లకు అనుగుణంగా ‘ఎడ్యుకేషన్ 4.0’ పేరిట సరికొత్త పాఠ్యప్రణాళికలను రూపొందించింది. బోధనాంశం ఏదైనా దానికి ఆధునిక టెక్నాలజీని అనుసంధానం చేసి నేరుగా స్పష్టంగా, అభ్యాసకులకు అర్ధం అయ్యే రీతిలో ఈ బోధన ఉంటుంది.

08/15/2017 - 02:25

హైదరాబాద్, ఆగస్టు 14: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్‌లో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. డంపింగ్ యార్డులో జరిగిన పేలుడు ధాటికి ఓ గేదె తల తెగిపడింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సమాచారం అందుకున్న మియాపూర్ ఏసీపీ, సీఐ హరిశ్చంద్రారెడ్డి, క్లూస్ టీంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

08/15/2017 - 04:19

హైదరాబాద్, ఆగస్టు 14: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే 71వ స్వాతంత్ర దినోత్సవ వేడులకు గోల్కొండ కోట ముస్తాబైంది. సిఎం కెసిఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో ప్రసంగిస్తారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వేడుకల సందర్భంగా రాజధానిలోని ప్రసిద్ధ, చారిత్రక కట్టడాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

08/15/2017 - 00:16

హైదరాబాద్, ఆగస్టు 14: వచ్చే నెలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు ఉంటాయని ఎఐసిసి కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంతియా తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులైన ఆర్‌సి కుంతియా సోమవారం మీడియాతో కొంత సేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్ ఒక్కటేనని ఆయన తెలిపారు.

08/15/2017 - 00:16

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొ.కోదండరామ్ స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు. ప్రజా ఉద్యమాలపై తెరాస ప్రభుత్వం నిర్భంధం చేయడం తగదని తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

08/15/2017 - 00:15

న్యూఢిల్లీ, ఆగస్టు 14: తెలంగాణలో ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏ జాబితాలోకి చేర్చే అంశంపై దాఖలైన కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ముదిరాజ్ కులాన్ని 2009లో బీసీ-డీ జాబితా నుండి బీసీ-ఏ జాబితాలోకి చేర్చుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ పలు కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తోసిపుచ్చింది.

08/15/2017 - 00:15

హైదరాబాద్, ఆగస్టు 14: ఆన్ లైన్ విధానం విజయవంతంగా అమలుచేయడంతో ఇటీవల ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఇంటర్మీడియట్ బోర్డుకు డిజిటల్ ఇనిషియేటివ్ అవార్డు దక్కింది. అవార్డును బోర్డు కార్యదర్శి ఎ అశోక్ అందుకున్నారు.

08/15/2017 - 00:14

హైదరాబాద్, ఆగస్టు 14: రాష్ట్రంలో కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలు నత్తనడకన సాగుతున్నాయని, వాటి వేగాన్ని పెంచాలని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సోమవారం నాడు దత్తాత్రేయ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులతో వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.

Pages