S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/16/2017 - 03:56

హైదరాబాద్, జూలై 15: తరచూ సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి, హకీంపేట వైపు ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్న ప్రజలకు కేంద్ర రక్షణ శాఖ ఊరట కల్పించబోతున్నది. రెండు రోడ్డు ప్రాజెక్టులకు రక్షణ శాఖ లైన్ క్లియర్ చేసింది. ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి క్రాస్ రోడ్డు వరకు, సికింద్రాబాద్ నుంచి హకీంపేట ఎయిర్ ఫోర్స్ వరకూ రోడ్డు వెడల్పుకు వంద ఎకరాలు ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ సుముఖత వ్యక్తం చేసింది.

07/16/2017 - 03:55

హైదరాబాద్, జూలై 15: ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారేలా ప్రయత్నిస్తున్నామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్ (హైటెక్స్) లోని నేషనల్ అకాడమీ ఫర్ కన్‌స్ట్రక్షన్‌లో శనివారం జరిగిన ‘అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం’ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత తమకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.

07/16/2017 - 03:53

హైదరాబాద్, జూలై 15: సినీ పరిశ్రమలో రోజుకో కొత్త పేరు.. కొత్త కోణం వెలుగులోకి వస్తుండటంతో టాలీవుడ్ ప్రతిష్ఠ మాదకద్రవ్యాల మత్తులో మంటగలిసిపోయింది. మద్యానికి, మత్తుపదార్థాలకు బానిసలైన వారి బతుకుల ఇతివృత్తంతో సినిమాలు తీస్తూ..సమాజ మార్పును కోరే సినీ ప్రముఖులే మద్యం, మత్తుపదార్థాలకు అలవాటుపడి డ్రగ్స్ రాకెట్‌లో కూరుకుపోవడంతో ప్రేక్షకాభిమానులు విస్తుపోతున్నారు.

07/16/2017 - 03:12

హైదరాబాద్, జూలై 15: అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో నిందితుడైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జివోపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది.

07/16/2017 - 03:11

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఈ నెల 26 లోగా అందించేందుకు అవకాశం ఇచ్చామని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ తెలిపారు.

07/16/2017 - 03:10

హైదరాబాద్, జూలై 15: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్నతస్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రమోషన్ ఇస్తూ డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇంధన) అజయ్ మిశ్రా నేతృత్వంలో కమిటీ సభ్యుడు ముఖ్యకార్యదర్శి (సర్వీసులు) అదర్ సిన్హా కలిసి ప్రమోషన్ల అంశంపై సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 31 మందికి ప్రమోషన్లు ఇచ్చారు.

07/16/2017 - 03:10

హైదరాబాద్, జూలై 15: తెలంగణ ప్రభుత్వం కేంద్ర భూసేకరణ చట్టం 2013ను సవరించి తెలంగాణ భూసేకరణ చట్టం 2016ను తేవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరాములవు దాఖలు చేశారు. రాష్ట్రప్రభుత్వం వెబ్‌సైట్‌లో సవరణల ఉత్తర్వులను ఉంచకుండా నేరుగా మే 31వ తేదీన జీవో 92ను జారీ చేసిందని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు.

07/16/2017 - 03:13

హైదరాబాద్, జూలై 15: నైపుణ్యాలకు పదును పెడితే మరిన్ని ఉద్యోగావకాశాలు కలుగుతాయని, తద్వారా బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించడం వీలవుతుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయిమెంట్ గైడెన్స్ బ్యూరో కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెంలో కూడా ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

07/16/2017 - 03:08

హైదరాబాద్, జూలై 15: రాష్ట్రంలో వితంతువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారు అనేక కష్టనష్టాలకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు తమ కాళ్లపై తాము నిలబడటానికి ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

07/16/2017 - 03:08

హైదరాబాద్, జూలై 15: రైతు సమగ్ర సర్వే, పంటల బీమా పథకాలకు సంబంధించిన సవివరమైన నివేదికలను వారంలోగా పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు, జాయింట్ డైరెక్టర్లు తదితరులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వ్యవసాయ విస్తరణాధికారులు క్లస్టర్ల వారీగా వివరాలు పంపించాలని ఆదేశించారు.

Pages