S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/16/2017 - 03:06

సికిందరాబాద్, జూలై 15: ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో శనివారం రాత్రి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నాన్‌బోర్డర్స్‌ను ఏరివేయడానికి ఒకవైపు ఓయు అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టగా మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఓయు పోలీసులు అదనపుబలగాలను మొహరించి సిద్ధంగా ఉన్నారు. శనివారం ఒయు నాన్‌బోర్డర్స్‌ను ఏరివేయాలన్న లక్ష్యంతో అధికారులు హాస్టల్స్‌కు విద్యుత్, నీటి కనెక్షన్‌ను తొలగించారు.

07/16/2017 - 00:50

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు వర్షాలు బాగా ఉండటం వల్ల భూగర్భజలాల పరిస్థితి మెరుగైందని భూగర్భజలశాఖ శనివారం ప్రకటించింది. 2016 మే నెలతో పోలిస్తే2017 జూన్‌లో భూగర్భజలమట్టం 3.76 మీటర్లుపెరిగింది. గత నెలలో తెలంగాణలోని 25 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా నీరు భూమిలోకి ఇంకడంతో భూగర్భజలాలు పెరిగాయి.

07/16/2017 - 00:49

హైదరాబాద్, జూలై 15: పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి యువజన సంఘం తీర్మానించింది. శనివారం యువజన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిసి సంక్షేమ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిసి యువజన సంఘం పలు తీర్మానాలు ఆమోదించింది.

07/16/2017 - 00:49

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో 44,451 సీట్లు ఉండగా ఇంత వరకూ 31,312 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 13,139 సీట్లు మిగిలినట్టు కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలో 1,09,088 మంది అర్హత సాధించారు. సర్ట్ఫికేట్లపరిశీలనకు తొలి దశలో 41,069 మంది, రెండో దశలో 2542 మంది హాజరయ్యారు.

07/16/2017 - 00:48

హైదరాబాద్, జూలై 15: వివిధ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పిజిటి, టిజిటి పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను శనివారం నాడు ప్రకటించారు. ఒక్కో పోస్టుకు ఐదుగురు సభ్యులు చొప్పున అభ్యర్ధులను మెయిన్ పరీక్షలకు ఎంపిక చేసినట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు.

07/16/2017 - 00:48

హైదరాబాద్, జూలై 15: ఓ హోటల్‌లో కుళ్లిన మాంసంతో బిర్యానీ చేస్తున్నారని ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్‌పెక్టర్ సోదాలు నిర్వహించారు. అయితే హోటల్‌పై కేసు పెట్టవద్దని యజమాని బేరానికి వచ్చాడు. దీంతో సదరు అధికారి రిపోర్టు తారుమారు చేసేందుకు రూ. 1.25 లక్షలు లంచం అడుగగా, హోటల్ యజమాని ఏసిబి అధికారులను ఆశ్రయించాడు.

07/16/2017 - 00:47

హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర వ్యాప్తంగా పళ్లతోటల వివరాలను సమగ్ర నివేదికగా రూపొందించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. నాబార్డు సహకారంతో 2016-17, 1017-18 సంవత్సరాలకు అమలవుతున్న సూక్ష్మ నీటిపారుదల (ఎంఐపి) పై శనివారం ఆయన ఇక్కడ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు ప్రాధాన్యత ఇస్తోందని, ఎంఐపి వల్ల నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

07/16/2017 - 00:46

హైదరాబాద్, జూలై 15: ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర ఔషధ సేవలు వౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎంఎస్‌ఐడిసి) మేనేజింగ్ డైరక్టర్ రామరాజు వేణుగోపాలరావు చెప్పారు. సిఎం కెసిఆర్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ కెసిఆర్ కిట్ల పథకం, డయాలసిస్ సెంటర్లు, బ్లడ్‌బ్యాంక్‌లు, లేబర్ రూంలు, ఐసియూల ఏర్పాటు పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారని అన్నారు.

07/15/2017 - 02:50

హైదరాబాద్, జూలై 14: విద్యార్ధులను బయటకు తీసుకువెళ్లే ఉద్యమ నాయకులపై కేసులు పెట్టాలని, అలా చేయకుంటే ఆయా విద్యాసంస్థల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డెన్లపై కేసులు పెట్టాలని పేర్కొం టూ సంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిన సర్క్యులర్‌పై విద్యార్ధి సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

07/15/2017 - 02:49

వరంగల్, జూలై 14: ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన టిఆర్‌ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. పాతకక్షల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న కార్పొరేటర్ మురళిని ఆయన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపిన విషయం తెలిసిందే. మురళి మృతదేహానికి శుక్రవారం ఉదయం ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిగింది.

Pages