S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/29/2016 - 06:37

హైదరాబాద్, జూలై 28: తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టి.ఎమ్సెట్-2 లీకేజి కేసులో ప్రధాన సూత్రధారి రాజ్‌గోపాల్ రెడ్డి లీకేజి స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు.

07/29/2016 - 06:35

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్సెట్ రాసిన వేలాది మంది విద్యార్థులను వణికిస్తున్న వ్యక్తి గిరి రవి. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రవి ఎమ్సెట్ లీకేజిని బహిర్గతం చేసి రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించారు. రవి ఒక సివిల్ ఇంజనీర్. ఆయన పశ్చిమాసియా దేశాల్లో కొన్ని ప్రైవేట్ ప్రాజెక్టులు చేస్తుంటారు. 47 సంవత్సరాల రవి ఏటా రెండు నెలలు ఇంటికి వచ్చి గడుపుతుంటారు.

07/29/2016 - 04:34

మహబూబ్‌నగర్, జూలై 28: పుష్కరాల సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో హడావిడి ఎక్కువైంది. జిల్లాలో 32 కృష్ణా పుష్కరాల మేజర్ ఘాట్లు, మరో 20 మైనర్ ఘాట్లుగా అధికారులు గుర్తించారు. జిల్లాలో పుష్కరాల పనులకు జిల్లా అధికార యంత్రాంగం దాదాపు రూ.426 కోట్లకు ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.270.21 కోట్లు మంజూరు చేసింది. అయితే పుష్కర ఘాట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.

07/29/2016 - 04:31

హైదరాబాద్, జూలై 28: కృష్ణా పుష్కరాల్లో పాల్గొనవలసిందిగా దేవనాత రామానుజ చిన్న జీయర్ స్వామిని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. కృష్ణా పుష్కరాల ఆహ్వాన కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో గురువారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. జీయర్ స్వామి ఆధ్వర్యంలో బీచ్‌పల్లి పుష్కర ఘాట్ వద్ద యజ్ఞం చేసేందుకు ఏర్పాటు చేయాలని రమణాచారి కోరారు.

07/29/2016 - 04:29

హైదరాబాద్, జూలై 28: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల నియామకాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మంత్రులు, న్యాయ నిపుణులు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం సమావేశం కానున్నారు. వైస్ ఛాన్స్‌లర్ల నియామకంపై హైకోర్టు నుంచి ఎదురైన చుక్కెదురును ఏవిధంగా అధిగమించాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

07/29/2016 - 04:28

నల్లగొండ, జూలై 28: జంటనగరాల్లో కురిసిన భారీ వర్షాలతో నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగి జలకళతో కనువిందు చేస్తోంది. ఇదే సమయంలో డిండి ప్రాజెక్టుకు జిల్లా పరిధిలో సరైన వర్షాలు లేక ఎలాంటి వరద నీటి ప్రవాహం చేరకపోవడంతో అడుగంటి నెర్రెలు బారి పూర్తిగా ఎండిపోయి కనిపిస్తోంది. మూసీ ప్రాజెక్టు నీటినిల్వ సామర్ధ్యం 645 అడుగులుకాగా ప్రస్తుతం 628 అడుగులకు చేరింది.

07/29/2016 - 04:27

గద్వాల, జూలై 28: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి వస్తున్న వరద నీటితో జూరాల పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని కళకళలాడుతోంది. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.34 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా, దిగువకు 44,265 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

07/29/2016 - 04:25

సిద్దిపేట, జూలై 28: మల్లన్నసాగర్ రిజర్యాయర్ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులకు రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిదని, వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

07/28/2016 - 18:09

హైదరాబాద్‌: ఎంసెట్‌-2 పరీక్షను రద్దు చేయొద్దని డిమాండ్‌ చేస్తూ గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పరీక్ష రద్దు చేస్తే వూరుకునేది లేదన్నారు. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తే దానిని సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. కొందరు స్వార్థపరులు చేసిన తప్పుకు తమను బాధ్యులు చేయడం సరికాదన్నారు.

07/28/2016 - 18:06

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2లో రెండు సెట్ల పేపర్లు లీకయ్యాయని సీఐడీ గురువారం ప్రకటన చేసింది. ‘ హైదరాబాద్‌, ఏపీ, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించాం. ఇప్పటివరకు విష్ణుధర్‌ అలియాస్‌ విష్ణువర్థన్‌, తిరుమల్‌ అలియాస్‌ తిరుమలరావును అరెస్టు చేశాం. వీరిద్దరూ 25 మంది విద్యార్థులను బెంగళూరుకు తీసుకెళ్లారు. పరీక్షకు 2, 3 రోజుల ముందు ప్రశ్నాపత్రాలు వారికి అందజేశారు.

Pages