S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/14/2017 - 02:50

వరంగల్, జూలై 13: వరంగల్ నగరంలోని 44వ డివిజన్ కార్పొరేటర్ అనిశెట్టి మురళిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసారు. ముగ్గురు నిందితులు వేటకొడవళ్లతో దాడిచేసి ఇష్టం వచ్చినట్లు నరకటంతో ఆయన మృతిచెందాడు. సంఘటన అనంతరం నిందితులు హన్మకొండ పోలీ సు స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీ సు అధికారులు మాత్రం ఈ విషయా న్ని అధికారికంగా ప్రకటించటం లేదు.

07/14/2017 - 02:47

మహబూబ్‌నగర్, జూలై 13: రాష్ట్రంలో రాజకీయాల ను ముఖ్యమంత్రి కెసిఆర్ కలుషితం చేశారని వారి మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేల తీరు అసభ్యకరంగా ఉం దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

07/14/2017 - 02:47

కరీంనగర్ టౌన్, జూలై 13: మానసిక ఒత్తిడికి గురైన ఓవిద్యార్థి తాను చదువుతున్న పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం నగరంలో సంచలనం సృష్టించింది.

07/14/2017 - 02:45

సంగారెడ్డి, జూలై 13: సాగు నీటిని అందించడానికి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ వేగవంతంగా కొనసాగుతోంది. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేస్తుండటంతో అధికారులు కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. రైతులు కోల్పోతున్న భూములకు ఎకరానికి 12 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారు.

07/14/2017 - 02:44

నిజామాబాద్, జూలై 13: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా విలసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఈ ఏడాది తీవ్ర నిరాశాజనకంగా ఉండడంతో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందడం ప్రశ్నార్ధకంగా మారింది. గతేడాది ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకోవడంతో ఖరీఫ్, రబీ సీజన్‌లలో ఆయకట్టుకు పుష్కలంగా నీటిని అందించగలిగారు.

07/14/2017 - 02:38

మహబూబాబాద్, జూలై 13: మహబూబాబాద్ జిల్లాలో హరితహారం సాక్షిగా జిల్లా కలెక్టర్ ప్రీతీమీనాకు జరిగిన అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్ చేయి పట్టుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చజరుగుతోంది. ఈవిషయాన్ని ఐఏఎస్ సంఘాలు కూడా సీరియస్‌గా తీసుకోవడం, స్వయంగా సిఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేత క్షమాపణ చెప్పించినా సమస్య సద్దుమణగలేదు.

07/14/2017 - 02:34

హైదరాబాద్, జూలై 13: బంగారు తెలంగాణ సాధించేందుకు మూడు సూత్రాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సరస్వత్ పేర్కొన్నారు. ‘బంగారు తెలంగాణ-సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు’(ఎస్‌డిజి) అంశంపై ఇక్కడి మర్రిచెన్నారెడ్డి మానవ వనరులు అభివృద్ధిసంస్థ (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి) లో గురువారం ఏర్పాటు చేసిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

07/14/2017 - 02:32

హైదరాబాద్, జూలై 13: అవినీతి నిరోధకశాఖ వలలో మరో పెద్దచేప చిక్కింది. ఆదాయనికి మించి ఆస్తులున్నాయని అభియోగాలతో పరిశ్రమశాఖ చీఫ్ ఇన్స్‌పెక్టర్ వెంకన్న ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడి చేశారు. అతనితోపాటు బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. మియాపూర్‌లోని కృషినగర్, మాసాబ్‌టాంక్‌లోని పరిశ్రమల శాఖ కార్యాలయం, సూర్యాపేట, నిజామాబాద్‌లలో ఏకకాలంలో ఏసిబి అధికారులు సోదాలు చేపట్టారు.

07/14/2017 - 02:31

హైదరాబాద్, జూలై 13: పాతబస్తీలో ఈ నెల 16, 17 తేదీల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు గాను సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

07/14/2017 - 02:30

హైదరాబాద్, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రధాన ఆదాయ వనరుగా చేసుకోవడం వల్ల మద్యం సేవించిన భర్త వల్ల పేద మహిళలు ఆర్ధికంగా నష్టపోవడమేగాక కుటుంబ పోషణ మరింత భారమవుతోందని, మద్యం నియంత్రణపై మహిళా మోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

Pages