S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/14/2017 - 01:58

హైదరాబాద్, జూలై 13: జాతీయ బిసి కమిషన్‌లో రాష్ట్రాల్లోని బిసి కమిషన్ చైర్మన్లను శాశ్వత సభ్యులుగా నియమించాలని తెలంగాణ బిసి కమిషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర బిసి కమిషన్ సమావేశం హైదరాబాద్‌లో గురువారం జరిగింది. రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, డాక్టర్ ఈడిగ ఆంజనేయులు గౌడ్, జూలూరి గౌరిశంకర్, సభ్యకార్యదర్శి జెడి అరుణ పాల్గొన్నారు.

07/14/2017 - 01:58

హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో బిజెపిని మరింత పటిష్టం చేయనున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు, పార్టీ పరిస్థితులను వివరించేందుకు గురువారం రాత్రి 9 గంటలకు దత్తాత్రేయ అమిత్‌షాతో భేటీ అయ్యారు.

07/14/2017 - 01:57

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్ధి వ్యతిరేక విధానాలను నిరశిస్తూ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించనున్నట్టు విద్యార్ధి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తెలిపింది.

07/14/2017 - 01:57

హైదరాబాద్, జూలై 13: రాష్ట్ర రాజధానిలోని ఎంఎన్‌జె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, రీజనల్ క్యాన్సర్ సెంటర్‌లో 251 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్స్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ లాబ్ టెక్నీషియన్స్ తదితర పోస్టులున్నాయి.

07/14/2017 - 01:56

హైదరాబాద్, జూలై 13: రైల్వే లైన్ల విద్యుదీకరణ వల్ల కాలుష్య రహిత రైల్వే నెట్‌వర్క్ ఏర్పడుతుందని రైల్వే బోర్డు ట్రాక్షన్ సభ్యుడు ఘన్‌శ్యామ్ సింగ్ అన్నారు. అంతేకాకుండా రైళ్లు సకాలంలో నడిచేందుకు వీలు ఉంటుందని చెప్పారు. గురువారం ఘన్‌శ్యామ్ సింగ్ దక్షిణ మధ్య రైల్వేను సందర్శించారు. ఈ సందర్భంగా ద.మ.రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ ఘన్‌శ్యామ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ద.మ.

07/14/2017 - 01:55

హైదరాబాద్, జూలై 13: మహానగరంలో ప్రతిరోజు పోగవుతున్న చెత్తను సుమారు 75 శాతాన్ని పునర్వినియోగించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. నగరంలో చెత్తను ఇంటి వద్దే తడి,పొడిగా వేర్వేరు చేసేందుకు వీలుగా మహిళలను చైతన్యవంతులను చేసేందుకు, వారికి తగిన ప్రోత్సాహాకాలను అందించేందుకు ఏర్పాటు చేసిన స్వచ్చదూత్ మొబైల్ యాప్‌ను మంత్రి కెటిఆర్ గురువారం హోటల్ తాజ్ దక్కన్‌లో ఆవిష్కరించారు.

07/14/2017 - 01:53

హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానాన్ని తీసుకు వస్తున్నామని, ప్రతి పోలీస్ స్టేషన్ అవసరాలను గుర్తించి వాటిని ఆధునిక వసతులతో ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ జిల్లా స్థిరీకరణ ప్రణాళికను రూపొందించినట్టు డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. డిస్ట్రిక్ట్ పోలీస్ స్టాబ్లిసేషన్ ప్లాన్ వెస్ట్‌జోన్ ఐజి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో రూపొందించడం జరిగిందన్నారు.

07/13/2017 - 23:22

హైదరాబాద్, జూలై 13: బోగస్ పాస్‌పుస్తకాలపై వ్యవసాయ రుణాలు ఇవ్వవద్దని బ్యాంకర్లకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా సూచించారు. గురువారం ఇక్కడ జరిగిన బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం భూములకు సంబంధించిన రికార్డులు, పట్టేదార్లపేర్లు వెబ్‌సైట్‌లో ఉన్నాయని గుర్తు చేశారు.

07/13/2017 - 23:21

హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో ఐసెట్ అడ్మిషన్ల తొలి దశను గురువారం పూర్తి చేశారు. ఐసెట్‌లో 69,100 మంది అర్హత సాధించగా అందులో 33,262 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో 31,629 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేయగా, 23,030 సీట్లు భర్తీ చేశారు. ఇంకా 328 సీట్లు మిగిలిపోయాయని కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు.

07/13/2017 - 23:23

హైదరాబాద్, జూలై 13: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతీ మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచిత ప్రవర్తనను ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఐఏఎస్ అధికారుల సంఘం గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య అధ్యక్షతన సమావేశమైంది.

Pages