S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/11/2017 - 23:32

హైదరాబాద్, జూలై 11: హైదరాబాద్‌లో మంగళవారం జరగాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. 2017-18లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణాజలాల కేటాయింపులను ఖరారు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే తమకు అధికారిక సమావేశాలు ఉన్న కారణంగా ఈ సమావేశానికి రాలేమని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు కృష్ణాబోర్డుకు తెలియజేయడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది.

07/11/2017 - 23:32

హైదరాబాద్, జూలై 11: మూసివేసిన బోరు బావుల్లో బాలలు దురదృష్టవశాత్తు పడి మృత్యువాత పడకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పంచాయితీరాజ్, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, భూగర్భ జలాల విభాగం డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

07/11/2017 - 23:31

హైదరాబాద్, జూలై 11: హైదరాబాద్‌లో అన్వర్ ఉల్ ఉలూమ్ విద్యా సంస్ధలను నేరుగా తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు వీలుగా తెలంగాణ వక్ఫ్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్ విచారించిన తర్వాత ఆదేశాలు జారీ చేశారు.

07/11/2017 - 23:31

హైదరాబాద్, జూలై 11: తెలంగాణలోని దేవాలయాలకు పాలక మండళ్ల నియామకం ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం 18 దేవాలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

07/11/2017 - 23:30

హైదరాబాద్, జూలై 11: హైదరాబాద్‌లో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా ముంబై తరలిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను డిఆర్‌ఐ (డైరెక్టర్ రెవెన్యూ అధికారులు) అదుపులోకి తీసుకున్నారు. లారీని సీజ్ చేసి 600కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి ఓ గంజాయి ముఠా ఆదివారం మిర్చి, ఉల్లి వంటి నిత్యావసర వస్తువుల లోడ్‌తో లారీ బయలుదేరింది.

07/11/2017 - 02:56

మహబూబ్‌నగర్, జూలై 10: దేశంలోనే తెలంగాణ పోలీసులు ఆదర్శంగా ఉన్నారని ఇది తాను చెప్పడంలేదని దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారంటూ దాంతో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు.

07/11/2017 - 02:53

హుజూరాబాద్ రూరల్, జూలై 10: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలోని గంగిరెద్దుల కాలనీలో ముగ్గురు కుమార్తెలను చంపి అనంతరం దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కందుగుల గ్రామానికి చెందిన గంటా కొమురయ్య (30) వివాహం చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన కొమురమ్మ (28)తో పదేళ్ల క్రితం జరిగింది.

07/11/2017 - 02:51

నల్లగొండ, జూలై 10: మద్దతు ధర కోసం నల్లగొండ జిల్లా దొండ, నిమ్మ పంటల రైతులు మరోసారి కలెక్టరేట్‌ను ముట్టడించి రోడ్డుపై దొండ, నిమ్మ దిగుబడులను రాశులుగా పోసి నిరసనకు దిగారు. సోమవారం పెద్దవూర, పిఏపల్లి తదితర మండలాల నుండి తరలివచ్చిన రైతులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఎదురుగా మిర్యాలగూడ-నల్లగొండ రోడ్డుపైన దొండ, నిమ్మకాయలను రాశులుగా పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన చేపట్టారు.

07/11/2017 - 02:50

కౌటాల, జూలై 10: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం కలకలం చెలరేగింది. వసతి గృహంలోని విద్యార్థినులు ఉదయం అల్పాహారం తిన్న వెంటనే వాంతులు, తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడం అవస్థగా మారడంతో పాఠశాల ఆవరణలోనే కుప్పకూలి పోయారు. కలుషిత ఆహారం వల్ల విద్యార్థిను లను హుటాహుటిన కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఉ.

07/11/2017 - 02:07

హైదరాబాద్, జూలై 10: అత్యంత ప్రతిష్టాత్మకమైన, కీలకమైన రాష్టప్రతి పదవికి ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఈ నెల 17న దేశ వ్యాప్తంగా పోలింగ్ జరగనున్నందున పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల రిటర్నింగ్ అధికారులు (కార్యదర్శులు) ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దేశానికి ప్రప్రథమ పౌరుడైన రాష్టప్రతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓట్లు వేస్తారు.

Pages