S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/09/2017 - 02:27

హైదరాబాద్, జూలై 8: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎలా చేయాలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి చూపించారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్ జయంతి సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి బంజారాహిల్స్‌లోని హైదరాబాద్ సెంటర్ వద్ద, పంజాగుట్ట ఉన్న వైఎస్ విగ్రహాలకు పూల దండలు వేసి నివాళి అర్పించారు.

07/09/2017 - 02:25

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూలై 8: మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని ‘పైగా’ భూములను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి గుంజుకుని హక్కుదారులకు అప్పగిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) హెచ్చరించారు. శనివారం కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలు, హక్కుదారులుగా పేర్కొంటున్న పలువురితో కలిసి జగ్గారెడ్డి మియాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

07/09/2017 - 02:23

హైదరాబాద్, జూలై 8: రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న నిత్యావసర వస్తువుల కల్తీని నివారించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కల్తీని నివారించే బాధ్యత పోలీసులకు అప్పగించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఇందుకు ప్రత్యేకించి ఉన్న కల్తీ నిరోధక అధికారి (్ఫడ్ ఇన్‌స్పెక్టర్ల) వ్యవస్థను పటిష్టం చేయాలని తెలిపారు.

07/09/2017 - 02:22

హైదరాబాద్, జూలై 8: చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడానికి బిసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. నామినేటెడ్ పద్దతిలో బిసిలను కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. నగరంలోని సిద్ధార్థ హోటల్‌లో శనివారం జరిగిన బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

07/09/2017 - 02:22

హైదరాబాద్, జూలై 8: కొత్తగా రూపొందించిన గేమింగ్ ఆర్డినెన్స్ వెంటనే అమల్లోకి వస్తోందని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఆన్‌లైన్‌లో ఎలాంటి జూదం ఆడినా, నిర్వహించినా కేసు నమోదు చేసేందుకు వీలవుతుంది. ఆన్‌లైన్ జూదం నివారించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సైబర్‌పోలీస్‌పై ప్రభుత్వం బాధ్యత పెట్టింది.

07/09/2017 - 02:22

హైదరాబాద్, జూలై 8: రాష్ట్రంలో చేపట్టిన ఎస్‌ఐల నియామక ప్రక్రియను తక్షణం పూర్తి చేయాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు. ఎస్‌ఐ పరీక్షల ఫలితాల వెల్లడి ఎందుకు ఆలస్యం అవుతుందో కారణాలను వెల్లడించాలని అన్నారు. శనివారం రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎస్‌ఐ అభ్యర్థులకు హామీ ఇచ్చిన విధంగా లాంగ్వేజ్ మార్కులపై జివోను తక్షణం జారీ చేయాలని కోరారు.

07/09/2017 - 00:19

హైదరాబాద్, జూలై 8: తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్‌లో 29,510 కేసులను పరిష్కరించామని అధికారికంగా ప్రకటించారు. లోక్‌అదాలత్‌కు సంబంధించిన వివరాలను ఈ అథారిటీ మెంబర్ సెక్రటరీ బి.ఆర్. మధుసూదన్‌రావు శనివారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.

07/09/2017 - 00:19

హైదరాబాద్, జూలై 8: అమాయక ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్న రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై లోగడ పెట్టిన ఛీటింగ్ కేసును వెనక్కి తీసుకోనని టి.కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిరు. సనత్‌నగర్‌లో వక్ఫ్ భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారిని ఖాళీ చేయాలని జిహెచ్‌ఎంసి తెల్ల కాగితంపై నోటీసులు ఇచ్చిందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

07/09/2017 - 00:18

హైదరాబాద్, జూలై 8: ఐసెట్ అడ్మిషన్ల సర్ట్ఫికేట్ల పరిశీలనలో భాగంగా 42వేల మంది అభ్యర్ధులను ఆహ్వానించగా అందులో కేవలం 20366 మంది మాత్రమే హాజరయ్యారు. ఐసెట్‌లో 69,011 మంది అర్హత సాధించారు. అందులో తొలి రోజు 14 వేల మందిని, రెండో రోజు 28వేల ర్యాంకు వరకూ, మూడో రోజు 42వేల ర్యాంకు వరకూ అభ్యర్ధులను ఆహ్వానించారు.

07/09/2017 - 00:18

హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు మళ్లీ కాస్త బలపడుతున్నాయి. గత నాలుగు రోజుల పాటు వర్షాలు తగ్గి ఎండలు పెరిగాయి. 32-33 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగి 34 నుండి 35 డిగ్రీల అత్యధిక ఉష్ణోగతలు నమోదయ్యాయి. శనివారం నుండి రుతుపవనాలు మళ్లీ కాస్త బలపడుతుండటంతో కొద్దిపాటి వర్షాలు కురుస్తున్నాయి.

Pages