S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/06/2017 - 03:14

హైదరాబాద్, జూలై 5: మియాపూర్ భూ కుంభకోణంతో కదలిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బుధవారం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సబ్-రిజిస్టర్ కార్యాలయాలను తనిఖీచేసి లావాదేవీలు, రిజిస్ట్రేషన్ల తీరును పరిశీలించారు. జిఎస్‌టి కంటే ముందు మూడురోజుల ఆదాయంపై ఆరా తీసిన ఆయన అధికారుల పనితీరు మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు.

07/06/2017 - 03:14

హైదరాబాద్, జూలై 5: సచివాలయంలో రెండు ఉద్యోగ సంఘాల మధ్య బుధవారం జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సెక్షన్ ఆఫీసర్లతో సచివాలయ ఉద్యోగుల సంఘం నిర్వహించిన సమావేశాన్ని సచివాలయంలోని టిఎన్‌జివోల శాఖ నాయకులు అడ్డుకోవడంతో ఈ వివాదానికి కారణమైంది. సచివాలయంలో పని చేస్తున్న 24 మంది సెక్షన్ ఆఫీసర్లను ఆంధ్రప్రదేశ్ స్థానికత కారణంగా ఆరు నెలల కిందట ఆ రాష్ట్రానికి కేటాయించింది.

07/05/2017 - 03:02

హైదరాబాద్, జూలై 4: రాష్టప్రతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ఎన్‌డిఎ అభ్యర్థి రామనాధ్ కోవింద్ హరిత ప్లాజాలో మంగళవారం భారతీయ జనతా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీ నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రామనాధ్‌కు బిజెపి, టిఆర్‌ఎస్, టిడిపి, వైకాపా నేతలు ఘనస్వాగతం పలికారు.

07/05/2017 - 02:56

హైదరాబాద్, జూలై 4: హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన మాదకద్రవ్యాల కేసులో మరో నలుగురు అరెస్టయ్యారు. మంగళవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నలుగురు ఎంఎన్‌సికి చెందిన ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 100 ప్యాకెట్ల ఎల్‌ఎస్‌డి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

07/05/2017 - 02:54

హైదరాబాద్, జూలై 4: జిఎస్‌టి అమలుతో లాభమా? నష్టమా? అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో చాలా గందరగోళం నెలకొన్నదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. జిఎస్‌టి అమలుతో ఖజానాకు ఏటా 3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పగా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అందుకు విరుద్ధంగా 3 వేల కోట్ల రూపాయల లాభం అని అన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.

07/05/2017 - 02:53

హైదరాబాద్, జూలై 4: ఏకీకృత సర్వీసు నిబంధనలను గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ వర్తింపజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆమె మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

07/05/2017 - 02:52

హైదరాబాద్, జూలై 4: గ్రూప్-2 తుది ఎంపిక ప్రక్రియను ఖరారు చేయకుండా రాష్ట్ర హైకోర్టు మరో నాలుగు వారాల పాటు స్టే పొడిగించింది. 14ప్రశ్నలు పూర్తిగా తప్పు ఉన్నాయని, దీంతో పాటు 17 ప్రశ్నలు తొలగించడంపైనా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరిగి గ్రూప్-2 పరీక్షను నిర్వహించాలని పిటిషనర్ నరసింహులు కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు నాలుగు వారాల పాటు ఎలాంటి ప్రక్రియ చేపట్టకుండా స్టే విధించింది.

07/05/2017 - 02:51

హైదరాబాద్, జూలై 4: రాష్ట్ర రాజధానిలో రోడ్ల అభివృద్ధికోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తొలి సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. రాజధాని రోడ్లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రణాళిక ఉండాలని సూచించారు.

07/05/2017 - 02:50

హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో బిఇడి కోర్సులో చేరేందుకు ఉస్మానియా యూనివర్శిటీ టిఎస్ ఎడ్‌సెట్-2017ను జూలై 16న నిర్వహించనుంది. టిఎస్‌ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 7వ తేదీ వరకూ ఉందని సెట్ చైర్మన్ ప్రొఫెసర్ రామచంద్రం, కన్వీనర్ ప్రొఫెసర్ సి మధుమతి తెలిపారు. 500 రూపాయల అపరాధ రుసుముతో జూలై 8వ తేదీ వరకూ చెల్లించవచ్చని ఆమె చెప్పారు.

07/05/2017 - 02:49

హైదరాబాద్, జూలై 4: తెలంగాణ రాష్ట్రంలో మూడంచెల వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థ తీసుకువస్తున్న నేపథ్యంలో వివిధ క్యాటగిరీ పోస్టులను ఏ విధంగా విభించాలన్న అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, జిఎడి ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా సంయుక్తంగా వివిధ శాఖల ప్రధాన అధికారులతో (హెచ్‌ఓడిలు) మంగళవారం సచివాలయంలో చర్చించారు.

Pages