S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/05/2017 - 02:43

హైదరాబాద్/రాజేంద్రనగర్, జూలై 4: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. మంగళవారం ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం తెరువగానే దుండగులు లోనికి ప్రవేశించి క్యాషియర్‌ను రివాల్వర్లు, కత్తులతో బెదిరించి భారీ దోపిడీకి విఫలయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అలారం మోగించారు. స్థానికుల గుమిగూడటంతో దుండగులు భయపడి పారిపోయారు.

07/05/2017 - 02:39

హైదరాబాద్, జూలై 4: ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి విఫలయత్నం చేసిన దుండగులు రాజేంద్రనగర్‌లోని హ్యాపీ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. దోపిడీకి వచ్చిన టవేరా వాహనం అక్కడ పార్కింగ్ చేసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 9 బ్లాకులతో 500 ఇళ్లు ఉన్న హ్యాపీ హోమ్స్ చుట్టూ 200 మంది పోలీసులు మొహరించారు. దొంగలను పట్టుకునేందుకు అపార్టుమెంట్ వాసులు సహకరించాలని పోలీసులు కోరారు.

07/05/2017 - 02:37

హైదరాబాద్, జూలై 4: వర్షాకాలం రావడంతో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. దోమల వల్ల వ్యాప్తి చెందే మలేరియా, చికెన్‌గున్యా, డెంగ్యూ తదితర జ్వరాలపై రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వాసుపత్రులు, బోధనాసుపత్రుల్లో అప్రమత్తత ప్రకటించింది. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది.

07/05/2017 - 02:36

హైదరాబాద్, జూలై 4: ఖరీఫ్ సీజన్‌లో రైతులకోసం బ్యాంకుల్లో నగదు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆర్‌బిఐ మంగళవారం నాడు తెలంగాణకు 2600కోట్ల రూపాయలు విడుదల చేసింది. సాధారణంగా జూలై 1న 1700 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా అదనంగా 900 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

07/05/2017 - 02:34

హైదరాబాద్, జూలై 4: తెలంగాణ రాష్ట్రంలో నైరుతీరుతుపవనాలు మరింత బలహీన పడ్డాయి. జూన్ రెండోపక్షంలో నైరుతీరుతుపవనాలు బలంగా ఉండటంతో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత రెండు రోజుల నుండి రుతుపవనాలు బలహీన పడుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో అక్కడక్కడా కొద్దిపాటి వర్షాలు కురిశాయి.

07/04/2017 - 03:11

సదాశివపేట, జూలై 3: గత ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు చూపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన స్థలాల కబ్జా కార్యక్రమాన్ని పోలీసులు నీరుగార్చారు.

07/04/2017 - 03:08

పెద్దపల్లి రూరల్, జూలై 3: ఓ సర్పంచ్ భర్త తరచూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తుండడాన్ని ఆమె సహించ లేకపోయింది. ఎంతోకాలం వౌనం వహించిన ఆమె చివరకు చెప్పుతో అతనిని కొట్టి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. అంతేకాకుండా ఆ వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను లైంగికంగా వేధిస్తున్నందుకు అతనిపై ఫిర్యాదు చేసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

07/04/2017 - 03:06

వరంగల్, జూలై 3: మనిషి తన నిజజీవితంలో ఏదో ఒక సందర్భంలో మాటలతో కాకుండా సైగలతో తన అభిప్రాయాన్ని తెలియచేయడం సర్వసాధారణమని, దీనినే మూకాభినయంగా ప్రచారంలోకి వచ్చిందని ప్రముఖ సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. ఈ కళ అనేక రూపాంతరాలు చెంది జనజీవనంలో పరోక్షంగా ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పారు.

07/04/2017 - 03:05

నిజామాబాద్, జూలై 3: సుమారు ఇరవై అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్ స్తంభం పైకి ఎక్కిన ఓ చిరుత పులి కరెంటు తీగల్లో చిక్కుకుని విద్యుదాఘాతంతో మృతి చెందిన అనూహ్య సంఘటన నిజామాబాద్ జిల్లా మల్లారం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం మల్లారంలోని వాగు వద్దకు నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపులి దానికి సమీపంలోనే ఉన్న కరెంటు స్తంభం పైకి ఎక్కింది.

07/04/2017 - 03:02

కురవి, జూలై 3: పిల్లలు లేని దంపతులు అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరమని చైల్డ్, ఉమెన్ వెల్ఫేర్ (కేంద్రీయ దత్తత రిసోర్స్ అథారిటీ) (సారా) అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఎం.రామచంద్రారెడ్డి తెలిపారు. ఒకవేళ అలా అక్రమ దత్తతను నిర్వహించిన ఇచ్చిన తల్లిదండ్రులు, పుచ్చుకున్న తల్లిదండ్రులు నేరస్థులుగా పరిగణించాల్సి ఉంటుందని, అక్రమదత్తత పిల్లలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు.

Pages