S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/04/2017 - 02:20

హైదరాబాద్, జూలై 3: టీవిలు గ్రామాలను ఆక్రమించక ముందు రచ్చబండ గ్రామాల్లో సాంస్కృతిక వేదికలుగా ఉండేవి. పొలం పనులు ముగించుకుని పెద్దల ముచ్చట్లతో సందడిగా నిలిచేవి. టీవిలు వచ్చిన తరువాత ఈ దృశ్యాలు గ్రామాల్లో కనిపించకుండా పోయాయి. గ్రామంలో ఏదైనా పంచాయితీ అయితే ఒక చోట గుమికూడడం మినహా గతంలో మాదిరిగా మంచి చెడులు మాట్లాడుకునే వేదికలు కనుమరుగయ్యాయి.

07/04/2017 - 00:16

హైదరాబాద్, జూలై 3: ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ పాలస్తీనా వెళ్లకపోవడం సరికాదని, గతంలో నాయకులు భారత్ నుండి ఎవరువెళ్లినా ఇటు ఇజ్రాయిల్‌ను అటు పాలస్తీనాను సందర్శించిన విషయాన్ని మరిచారా అంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రధాని పర్యటన తీరు చూస్తే గతంలో మాదిరి పాలస్తీనాతో సత్సంబంధాలు కనిపించడం లేదని అన్నారు.

07/04/2017 - 00:15

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ ప్రాంతంలో నైరుతీ రుతుపవనాలు సాధారణంగా ఉండటంతో వ్యవసాయ పనులు, విత్తనాలు వేయడం కొద్దిగా తగ్గింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో వచ్చే ఐదురోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం భారీ వర్షసూచన ప్రకటన వెలువడలేదు.

07/04/2017 - 00:15

హైదరాబాద్, జూలై 3: ఇటీవల జారీ చేసిన వివిధ రిక్రూట్‌మెంట్‌ల నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్ధులు తమ వివరాలను సరిచేసుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ 22/2017 నుండి 29/2017 వరకూ 8 నోటిఫికేషన్లుతో పాటు 35/2017 నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా దరఖాస్తు చేసిన అభ్యర్ధులు తమ వివరాలను సరిచేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ఎ వాణి ప్రసాద్ తెలిపారు.

07/04/2017 - 00:14

హైదరాబాద్, జూలై 3: నేరుగా ఇంజనీరింగ్‌లో చేరేందుకు సాధారణ గ్రాడ్యూయేట్లకు, పాలిటెక్నిక్ అభ్యర్ధులకు వీలుకల్పించే ఇసెట్ కౌనె్సలింగ్‌కు దాదాపు 10వేల మంది దూరంగా ఉండిపోయారు. ఇసెట్‌లో అర్హత సాధించిన 22,564 మంది అభ్యర్ధుల్లో కేవలం 15,315 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు.దాంతో ఈ నెల 4వ తేదీన చివరి అవకాశాన్ని అడ్మిషన్ల కమిటీ ఇచ్చింది.

07/04/2017 - 00:14

హైదరాబాద్, జూలై 3: ‘రాష్ట్రంలో మూడేళ్ల కిందటి విద్యుత్ పరిస్థితికి ఇప్పటికి అసలు పోలికే లేదు. తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న రాష్ట్రం ప్రస్తుతం కోతలు లేకుండా సరఫరా చేయగలుగుతున్నారు. ఇదేలా సాధ్యమైంది? ఇంత తక్కువ వ్యవధిలో ఎలా సాధ్యమైంది? విద్యుత్ సబ్సిడీల వల్ల పడే ఆర్థికభారాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నారు?’ అని యువ ఐఏఎస్‌లు వెలిబుచ్చిన సందేహాలు ఇవీ.

07/03/2017 - 03:44

సిరిసిల్ల, జూలై 2: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల క్రాస్ రోడ్డు వద్ద ఇసుక లారీ వ్యక్తిని ఢీకొట్టి ప్రాణాలు హరించిన సంఘటనతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆరు లారీలకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదుపు చేయబోయిన ఎస్సైపై ప్రజలు దాడి చేసి నెట్టివేయడంతో గాయాలకు గురయ్యాడు.

07/03/2017 - 03:39

భువనగిరి, జూలై 2: అమెరికాలోని నార్త్‌కరోలినాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భువనగిరి పట్టణానికి చెందిన పోత్నాక్ ప్రదీప్ (29) దుర్మరణం చెందాడు. తన జన్మదిన వేడుకల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రదీప్ కారు ప్రమాదంలో మృతి చెందడం విషాదకరం.

07/03/2017 - 03:37

సిద్దిపేట, జూలై 2: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైసమ్మ దేవాలయం బోనాల ఉత్సవం సందర్భంగా తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టిజెఎసి చైర్మన్ కోదండరామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నట్లుగానే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని తల్లిని వేడుకున్నట్టు పేర్కొన్నారు.

07/03/2017 - 03:35

వడ్డేపల్లి, జూలై 2: తెలంగాణాకే తలమానికంగా ప్రచారం చేస్తున్న వరంగల్ ఎంజిఎంలో వైద్యుల, అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం జరిగిన సంఘటనతో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. అర్బన్ జిల్లాలోని పెగడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ స్వప్న దంపతులకు శుక్రవారం పాప జన్మించగా ఆనారోగ్యంతో ఉన్న పాపను ఎంజిఎంలోని నవజాత శిశుకేంద్రానికి తరలించారు.

Pages