S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/21/2016 - 05:31

హైదరాబాద్, డిసెంబర్ 20: మిషన్ భగీరథ పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణపై అధికార విపక్షాల మధ్య మంగళవారం అసెంబ్లీలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది.

12/21/2016 - 03:41

మహబూబ్‌నగర్, డిసెంబర్ 20: కోయిల్‌సాగర్ ఆయకట్టుకు సాగునీరు వదలాల్సిందేనని, యాసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా తమ పొలాలకు సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలను కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు నిలదీశారు.

12/21/2016 - 03:22

వాంకిడి, డిసెంబర్ 20: దైవ దర్శనం చేసుకోవడానికి మహారాష్టల్రోని రాజురా వద్దగల జోగాపూర్ జాతరకు వెళ్ళి వస్తూ ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలంలో జరిగింది.

12/21/2016 - 03:18

మహబూబ్‌నగర్, డిసెంబర్ 20: నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ కలకలం రేగింది. మూడేళ్ల క్రితం విదేశీయులకు చెందిన డిబిర్స్ అనే వజ్రాల కంపెనీకి నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాల తవ్వకానికి కేంద్రం అప్పట్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

12/21/2016 - 03:14

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 20: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కమీషన్ కోసం కక్కుర్తిపడ్డ వారిని పెద్దనోట్ల మార్పిడి ముఠా మోసగించింది. మిర్యాలగూడకు చెందిన టైలర్ వహీద్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపగా 8.5 లక్షల రూపాయల కొత్త కరెన్సీతో పరారైన వ్యక్తి గోపినాథ్‌రెడ్డి, మధ్యవర్తిత్వం వహించిన అన్వర్‌ను అరెస్టు చేసినట్టు ఒన్‌టౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి మంగళవారం తెలిపారు.

12/21/2016 - 03:13

హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్ నగర పరిధిలో వాయు, నీటి, శబ్ద కాలుష్యం పెరుగుతున్న మాట వాస్తవమేనని ఐటి, మున్సిపల్ పరిపాలన మంత్రి కె తారకరామారావు మంగళవారం శాసనసభలో చెప్పారు. వాయు నాణ్యత సూచిక (ఎక్యుఐ) ప్రకారం చుట్టూ వ్యాపించిన వాయువునాణ్యత సముచితం, సంతృప్తికరం లేదా ఓ మోస్తరు నాణ్యతా శ్రేణిలో ఉందని చెప్పారు.

12/21/2016 - 03:13

హైదరాబాద్, డిసెంబర్ 20: చిల్లరనోట్ల కష్టాలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాలనుంచి ఉద్యమం చేపట్టాలని ఎఐసిసి కార్యదర్శి రామచంద్ర కుంతియా కార్యకర్తలను కోరారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం పెద్దనోట్లను రద్దుచేసి అనాలోచిత నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై గ్రామస్థాయ నుంచి ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.

12/21/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 20: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 270.10 కోట్ల రూపాయల వ్యయంతో 117.02 ఎకరాల విస్తీర్ణంలో మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు మంగళవారం నాడు శాసనసభలో చెప్పారు.

12/21/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 69,706 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అనుమతి మంజూరు చేయనున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మంగళవారం నాడు శాసనసభలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 21.64 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు.

12/21/2016 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పటిష్టపరచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే నెల 350 కోట్లతో కొత్తగా 1436 మినీ బస్సులను ప్రవేశపెడతామని రవాణా మంత్రి పి మహేందర్‌రెడ్డి మంగళవారం నాడు శాసనసభలో చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్‌కు ఎసి బస్సులను నడపుతామని పేర్కొన్నారు.

Pages