S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/03/2017 - 02:34

హైదరాబాద్, జూలై 2: తెలంగాణలో నైరుతీ రుతుపవనాలు తాత్కాలికంగా బలహీనపడ్డాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా ఇతర జిల్లాల్లో పెద్దగా వర్షాలు లేవు. ఆకాశం మేఘాలతో ఉన్నప్పటికీ, వర్షాలు తీసుకువచ్చే మేఘాలు లేకపోవడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో బలహీనంగా ఉన్నాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి ప్రకటించారు.

07/03/2017 - 02:34

హైదరాబాద్, జూలై 2: తెలంగాణ విశ్వవిద్యాలయాల కామన్ పిజి ఎంట్రెన్స్ పరీక్షల ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ఆదివారం విడుదల చేశారు. ఉస్మానియా, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు వర్సిటీల్లో 72,077 మంది విద్యార్థులు హాజరుకాగా 68,912 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. విద్యార్థులు ఒయు వెబ్‌సైట్ నుంచి ర్యాంకులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

07/02/2017 - 01:23

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బిసిలకు, కుల వృత్తుల వారికి గుర్తింపు వస్తుందని వారంతా సామాజికంగా ఆర్ధికంగా రాజకీయంగా అభివృద్ధిలోకి వస్తారని భావించినా, సమైక్య రాష్ట్రంలో కంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే బిసిలకు తీరని అన్యాయం జరుగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ త్యాగరాయగానసభలో జరిగిన బిజెపి బిసి మోర్చ గీతకార్మిక సదస్సులో ఆయన మాట్లాడారు.

07/02/2017 - 01:22

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూలై 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ)లో పిహెచ్‌డి చేస్తున్న విశాల్ టాండన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగుండ్లలోని అపర్ణ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోన్న విశాల్ శనివారం సాయంత్రం అపార్టుమెంట్ 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

07/02/2017 - 01:22

హైదరాబాద్, జూలై 1: జోనల్ వ్యవస్థ రద్దు చేసి, రెండంచెల వ్యవస్థ తీసుకురావడం వల్ల వెనుకబడ్డ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, అందువల్ల ఈ అంశంపై హడావుడిగా, అశాస్ర్తియంగా నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ ఉద్యోగుల సంఘం నిర్వహించిన రౌండ్‌టెబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.

07/02/2017 - 01:21

హైదరాబాద్, జూలై 1: కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, విజిలెన్స్ దాడులు పెంచాలని, కల్తీ చేసే వారి అంతు చూడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో శనివారం వ్యవసాయాభివృద్ధిపై జరిగిన సమావేశంలో కల్తీ ఎరువులు, విత్తనాలపై ప్రత్యేకంగా చర్చించారు.

07/01/2017 - 03:22

నర్సాపూర్,జూన్ 30: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పేదలకు పట్టా సర్ట్ఫికెట్లు ఇచ్చిన స్థలంలో గుడిసెలు వేసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు వాకిటి సునీతారెడ్డి ఆధ్వర్యంలో 2014లో అర్హులైన 1370 మంది పేద వారిని గుర్తించి ఇళ్ల స్థలాల కోసం పట్టా సర్ట్ఫికెట్లు ఇచ్చారు.

07/01/2017 - 03:20

న్యూఢిల్లీ, జూన్ 30: తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి అధిక నిధులను మంజూరు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీకి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. దత్తాత్రేయ శుక్రవారం ఇక్కడ కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో భేటీ అయ్యారు. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

07/01/2017 - 03:19

కల్వకుర్తి, జూన్ 30: తెలంగాణలోని పేద ఆర్యవైశ్యులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రూ.1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు.

07/01/2017 - 03:18

నాగర్‌కర్నూల్, జూన్ 30: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో రూ.12 కోట్లతో పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ వెల్లడించారు.

Pages