S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/28/2016 - 06:02

లింగాల, ఆగస్టు 27: మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఒక బాలుడు ఏకంగా నాలుగున్నర కిలోల బరువుతో జన్మించాడని ఎస్పీహెచ్‌ఓ డాక్టర్ అల్లె శ్రీనివాసులు తెలిపారు. బల్మూర్ మండలం అనంతవరం గ్రామానికి చెందిన బాలమణి సిజేరిన్ ఆపరేషన్ చేయగా, అధిక బరువుతో ఈ బాలుడు జన్మించాడు. దీంతో తల్లిదండ్రులు రాంబాబు, బాలమణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

08/28/2016 - 06:01

ఆగస్టు, 27: పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన తెరపైకి తెచ్చింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుండి ఎలాంటి డిమాండ్ లేకున్నా హన్మకొండ జిల్లా ఏర్పాటుకు ముసాయిదాలో చోటుదక్కడం, ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి జనగామ జిల్లా ఏర్పాటు బలంగా ఉన్నా ముసాయిదాలో చోటు దక్కకపోవడం పట్ల ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

08/28/2016 - 06:01

హైదరాబాద్, ఆగస్టు 27: వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్ తిలకించడంతో పాటు, అంతర్జాతీయ వ్యవసాయ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం అమెరికా వెళుతోంది. మంత్రివెంట కరీంనగర్ ఎంపి బి. వినోద్‌కుమార్, వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండి మురళి తదితరులు వెళుతున్నారు.

08/28/2016 - 06:00

హైదరాబాద్, ఆగస్టు 27: కాశ్మీర్‌లో శాంతి నెలకొనడానికి అన్ని వర్గాల వారితో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. 50 రోజులుగా కాశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగడం పట్ల ఆయన శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

08/28/2016 - 05:55

హైదరాబాద్, ఆగస్టు 27: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై విపక్షాలకు కనీస అవగాహన లేదని టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహారాష్టత్రో 152 మీటర్లకు ఒప్పందం జరగలేదని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి హుందాగా అంగీకరించారని, రాజకీయాలకు అతీతంగా మాట్లాడి పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు.

08/28/2016 - 05:54

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే వారికి తత్కాల్ అమలుచేస్తున్నట్టు సంచాలకుడు ఎస్ వెంకటేశ్వర శర్మ చెప్పారు. గత ఏడాది అడ్మిషన్ తీసుకున్న అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ నెల 29వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీలోగా సమర్పించాలని చెప్పారు. ఎస్సెస్సీ అభ్యర్ధులు 500 రూపాయిలు, ఇంటర్ అభ్యర్ధులు 1000 రూపాయిలు చెల్లించాలని అన్నారు.

08/28/2016 - 05:53

హైదరాబాద్, ఆగస్టు 27: శాసనమండలి (కౌన్సిల్)లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పాతూరి సుధాకర్ రెడ్డిని, ప్రభుత్వ విప్‌లుగా బి. వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు.

08/28/2016 - 05:53

హైదరాబాద్, ఆగస్టు 27: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైకాపాను ఆహ్వానించకపోవడంపై హైకోర్టులో ఆ పార్టీ పిల్ దాఖలు చేసింది. భవిష్యత్తులో జరిగే అన్ని అఖిలపక్ష సమావేశాలకు గుర్తింపు పొందిన వైకాపాను కూడా ఆహ్వానించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ పిల్‌ను వైకాపా ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ దాఖలు చేశారు.

08/28/2016 - 05:51

హైదరాబాద్, ఆగస్టు 27: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 నాటి గ్రూప్-1 పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ అభ్యర్ధులకు పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించిందని కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. కొంత మంది అభ్యర్ధులు వెబ్‌సైట్‌లో తమ పరీక్ష కేంద్రాలను అప్‌డేట్ చేయలేదని, వారంతా వెంటనే తమ పరీక్ష కేంద్రాల ఎంపికను పూర్తి చేయాలని చెప్పారు.

08/28/2016 - 05:51

హైదరాబాద్, ఆగస్టు 27: పార్టీ మారిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని బిజెపి నేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో బిజెపి పక్ష కార్యాలయంలో పార్టీ సభా నాయకుడిగా కిషన్‌రెడ్డి శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన గణపతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి టిఆర్‌ఎస్ పాలనపై నిప్పులు చేరిగారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Pages