S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/01/2017 - 02:35

హైదరాబాద్, జూన్ 30: పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చెరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించలేదని ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఐఎఎస్ అధికారులు రంజీవ్ ఆచార్య, సందీప్ కుమార్ సుల్తానియా, ఏ వాణి ప్రసాద్‌లు కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. హైకోర్టుకు ఇచ్చిన మాటకు కట్టుబడి తాము నియమావళిని ఉల్లంఘించలేదని వారు కోర్టుకు తెలిపారు.

07/01/2017 - 02:34

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణసాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్ధల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో వ్యాయామ టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు నోటీసులను హైకోర్టు జారీ చేసింది.

07/01/2017 - 02:34

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం శుక్రవారం ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి వారం క్రితం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లలో టికెట్ల ధర పెంపునకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

07/01/2017 - 02:33

హైదరాబాద్, జూన్ 30: దేశ వ్యాప్తంగా శుక్రవారం అర్థరాత్రి నుంచి వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రానున్న నేపధ్యంలో దీని ప్రభావం వివిధ రంగాలపై పడుతుందని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది.

07/01/2017 - 02:33

హైదరాబాద్, జూన్ 30: జిఎస్‌టిలో మంచికి స్వాగతం పలుకుతున్నాం, అదే విధంగా ప్రజలకు నష్టం కలిగిస్తుంది అన్న అంశాలను వ్యతిరేకిస్తున్నట్టు శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. జాతీయ పార్టీ అని చెప్పుకొనే టిడిపి జిఎస్‌టి, నియోజక వర్గాల పునర్విభజన, రాష్టప్రతి ఎన్నికలు తదితర అంశాల్లో ఆంధ్రలో ఒక మాట తెలంగాణలో ఒక మాట మాట్లాడుతోందని విమర్శించారు.

07/01/2017 - 03:32

ఎల్లారెడ్డి, జూన్ 30: మద్యం మత్తులో స్నేహితులు సరదాగా కుస్తీ పడిన సంఘటనలో ఓ నిండు ప్రాణం బలైన సంఘటన ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని సోమార్‌పేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కె.శ్రీ్ధర్‌రెడ్డి శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/01/2017 - 01:17

హైదరాబాద్, జూన్ 30: సమ్మె విషయంలో తొందరపడవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ రేషన్ డీలర్లను కోరారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమ యం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఓపిక పట్టాలని ఆయన కోరారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ప్రత్యామ్నా య మార్గాలు ఆలోచించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

07/01/2017 - 01:16

హైదరాబాద్, జూన్ 30: ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తున్న కరడగట్టిన దొంగను అరెస్టు చేసి రూ.45 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నగర ఉత్తర మండల డిసిపి తెలిపారు.

07/01/2017 - 01:16

కురవి, జూన్ 30: పిల్లలను అక్రమంగా విక్రయస్తున్న డాక్టర్ ఉదంతం బయటపడటంతో ఆ పిల్లలను తీసుకున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఇన్నాళ్లూ కన్నబిడ్డకన్నా ఎక్కువగా సాకిన పిల్లలను ఇప్పుడు తమ బిడ్డలు కాదంటూ తీసుకుపోవడం న్యాయం కాదని ఆక్రందిస్తున్నారు.

07/01/2017 - 00:39

హైదరాబాద్, జూన్ 30: జిఎస్‌టితో రైతులు కుదేలవుతారని సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లపై పన్ను, బ్యాంకుల్లో సేవా పన్ను వసూలు చేస్తారని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వ్యవసాయం అంటే ఆసక్తి తగ్గే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ పథకం హామీకే పరిమితమైందని ఆయన విమర్శించారు.

Pages