S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/01/2017 - 00:39

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ వ్యాయామ విద్యా కళాశాలల్లో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన పిఇసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. బిపిఇడిలో టాప్-3 ర్యాంకుల్లో తొలి ర్యాంకును వనపర్తికి చెందిన రాళ్ల నవత, రెండో ర్యాంకు వరంగల్‌కు చెందిన అశ్విని, మూడో ర్యాంకు చర్లకు చెందిన శ్రీను దక్కాయి.

07/01/2017 - 00:38

హైదరాబాద్, జూన్ 30: రాష్ట్రంలో ఎస్టీల కోసం కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ , ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో 21 ప్రాంతాల్లో 21 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.

07/01/2017 - 00:38

హైదరాబాద్, జూన్ 30: రాష్ట్ర వ్యాప్తంగా 16 గ్రామ పంచాయితీలు, నాలుగు ఎంపిటిసిలు, 133 వార్డు సభ్యులకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. జూలై 13న పోలింగ్ జరుగుతుంది. అవసరం అయితే 14న రీ పోలింగ్ జరుగుతుంది. జూలై 15న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలు ప్రకటిస్తారు.

06/30/2017 - 03:03

హైదరాబాద్, జూన్ 29: ఇంకా కార్యకలాపాలు ప్రారంభించని గనుల లీజును రద్దు చేయనున్నట్టు గనుల శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. లీజులు పొంది గడువులోగా కార్యకలాపాలు జరపకుండా పడి ఉన్న గనులపై చర్యలు తీసుకోవాలని గనుల శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. లీజుల పత్రంలోని నిబంధనల మేరకు మైనింగ్ ప్రారంభించి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం లభించడంతో పాటు పలువురికి ఉపాధి లభించేదని అన్నారు.

06/30/2017 - 03:00

హైదరాబాద్, జూన్ 29: పోలీసులు సత్ప్రవర్తనతో సేవలందిస్తే మంచి గుర్తింపు వస్తుందని, పోలీసులు ప్రజలకు మరింత చేరువవ్వాలని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ సూచించారు. గురువారం ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమిలో ‘పోలీస్-ప్రజాసంబంధాలు-పిఆర్‌ఓ’లపై రెండు రోజుల వర్కుషాపును డిజిపి అనురాగ్‌శర్మ ప్రారంభించారు.

06/30/2017 - 02:58

హైదరాబాద్, జూన్ 29: జోనల్ వ్యవస్థ రద్దు కానున్న నేపథ్యంలో తెలంగాణ స్థానికులుగా పరిగణించడానికి 15 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉండి ఉండాలనే నిబంధన పెట్టాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సూచించారు. స్థానికతకు 15 సంవత్సరాల కాలపరిమితి నిర్ణయిస్తే తెలంగాణ వారికి న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

06/30/2017 - 02:22

హైదరాబాద్, జూన్ 29: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా ‘రైల్ రోకో’లో పాల్గొని నిరశన తెలిపిన కేసులో ముగ్గురు రాష్ట్ర మంత్రులు కేటిఆర్, నాయిని నర్సింహారెడ్డి, టి పద్మారావు గురువారం సికిందరాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

06/30/2017 - 00:57

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలోని ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో అడ్మిషన్లకు ఉన్నత విద్యా మండలి షెడ్యూలును ఖరారు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం నాడిక్కడ జరిగిన అడ్మిషన్ల కమిటీ షెడ్యూలును ఖరారు చేసింది. సర్ట్ఫికేట్ల పరిశీలన 6వ తేదీ నుండి 10 వరకూ జరుగుతుంది.

06/30/2017 - 00:56

హైదరాబాద్, జూన్ 29: విద్యుత్ అవుట్ సోర్స్ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని విద్యుత్ సంస్ధల్లో పనిచేస్తున్న 23,699 మంది ఔట్ సోర్స్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు విద్యుత్ సంస్ధలు తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజనితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేశారు.

06/30/2017 - 00:56

హైదరాబాద్, జూన్ 29: సంతాన సాఫల్య కేంద్రాలపై దాడి చేసిన కేసులో కనుగొన్న సరోగేట్ తల్లులు (అద్దె గర్భం తల్లులు) సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సంరక్షణ, సంక్షేమ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ అనే హైకోర్టు న్యాయమూర్తి రాసిన లేఖను ధర్మాసనం సుమోటోగా స్వీకరించి విచారించింది. కోర్టు ఆదేశంపై ప్రభుత్వ అధికారులు నివేదిక ఇచ్చారు.

Pages