S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/27/2016 - 05:15

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రూపొందించిన ప్రతిపాదిత జిల్లాల మ్యాప్‌లను ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇఆర్‌ఏసి సాయంతో భూపరిపాలన శాఖ వీటిని రూపొందించింది.

08/26/2016 - 17:56

హైదరాబాద్: తెరాస పార్టీలో తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని (టిడిఎల్‌పి)ని విలీనం చేయడంపై కేసు విచారిస్తున్న ఉమ్మడి తెలుగురాష్ట్రాల హైకోర్టు తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయించిన ఎమ్మెల్యేలు, పిటిషనర్ రేవంత్‌రెడ్డిలు లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

08/26/2016 - 17:53

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం సోదరుడు ఫహీం దంపతులకు రెండురోజుల పోలీసు కస్టడీ శుక్రవారం ముగిసింది. కోర్టు ఆదేశాలతో నిన్న ఫహీం దంపతులను నార్సింగి పోలీసులు - నయీం వివిధ రాష్ట్రాల్లో కూడబెట్టిన ఆస్తులు, చేసిన అకృత్యాల గురించి వీరిని పోలీసులు పలు కోణాల్లో విచారించినట్లు సమాచారం. కస్టడీ ముగియడంతో శుక్రవారం సాయంత్రం వీరిని రాజేంద్రనగర్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు.

08/26/2016 - 17:42

హైదరాబాద్‌: జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసేందుకు ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం నిర్ణయించారు. అసెంబ్లీ కార్యదర్శి సదారామ్‌, మంత్రి హరీశ్‌రావులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 30న ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం కానున్నాయి.

08/26/2016 - 17:39

వరంగల్‌: హన్మకొండ సుబేదారిలోని ఉన్నత పాఠశాలలో పాతకాలపు నాటి గోడలను శుక్రవారం కూల్చి వేస్తుండగా పురాతనమైన లాకర్‌ లభ్యమైంది. లాకర్‌లో ఏముందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పుతో భారీ మందంతో ఉన్న ఈ లాకర్‌ను 1942లో ఆల్విన్‌ కంపెనీ తయారుచేసినట్లు అధికారులు గుర్తించారు.

08/26/2016 - 17:35

ఆదిలాబాద్‌ : మంచిర్యాలలో శివాని అనే వైద్య విద్యార్థిని శుక్రవారం రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ జారిపడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు శివాని విడిచింది. మంచిర్యాలలోని రాంనగర్‌ వాసిగా శివానిని పోలీసులు గుర్తించారు.

08/26/2016 - 17:20

నల్లగొండ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం యాదగిరిగుట్టలో తెలిపారు. ప్రజలకు లబ్ధి చేకూరే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు.

08/26/2016 - 17:18

హైదరాబాద్: ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించారు. గణేశ్ నవరాత్రుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

08/26/2016 - 17:05

హైదరాబాద్ : కొత్త జిల్లాల మ్యాప్లను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మరోవైపు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా తెలియజేయవచ్చు. ప్రభుత్వం 30 రోజుల గడువునిచ్చింది.

08/26/2016 - 16:36

హైదరాబాద్‌: నీటి పంపకాలే ప్రధాన అజెండాగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. నిర్వహణ మార్గదర్శకాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ ఏర్పాట్లు, ఉమ్మడి జలాశయాల నిర్వహణ నిధులు, కొత్త ప్రాజెక్టులు తదితర పది అంశాలతో కూడిన అజెండాను బోర్డు రూపొందించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చింది.

Pages