S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/24/2016 - 12:27

హైదరాబాద్: సెప్టెంబర్15న గణేష్‌ నిమజ్జనంలో ఖైరతాబాద్‌ వినాయకుడిని ముందే నిమజ్జనం చేయాలని బుధవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. వినాయక చవితి, బక్రీద్ పండుగలపై సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్15న తొలుత ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం చేయాలని, ఊరేగింపు ఉదయమే ప్రారంభించాలని నిర్ణయించారు.

08/24/2016 - 12:19

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు దాదాపు 6 లక్షల రూపాయల ఖరీదైన నెక్లెస్‌ను అందించనున్నట్లు ఎన్‌ఏసీ జ్యూయలర్స్ యాజమాన్యం తెలిపింది.

08/24/2016 - 11:38

కరీంనగర్: సస్పెండైన ఏఎస్సై మోహన్‌రెడ్డికి కరీంనగర్ జిల్లా కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. జిల్లాకు చెందిన నారాయణరెడ్డి మృతదేహం దగ్గర లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు మోహన్‌రెడ్డిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోహన్‌రెడ్డి బాధిత సంఘం ఆందోళనల నేపథ్యంలో పోలీసులు మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

08/24/2016 - 11:22

సికింద్రాబాద్ : ఉప్పల్లో సాయికుమార్, విజయ్‌కుమార్ అనే ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమైన సంఘటన బుధవారం వెలుగుచూసింది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు తిరిగి ఇంటి్కి రాలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

08/24/2016 - 08:45

హైదరాబాద్, ఆగస్టు 23: ‘మహా’ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పలు ప్రాజెక్టులపై ఒప్పం దం చేసుకుంటున్న సమయంలోనే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమి టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.

08/24/2016 - 08:45

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుదుర్చుకున్న ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. పాలక, ప్రతిపక్షాల నేతలు ఈ విధంగా స్పందించారు.
ఇది కెసిఆర్ రచించిన మరో చరిత్ర

08/24/2016 - 08:44

మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 23: తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న సాగునీటి ఒప్పందం యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసేదిగా ఉందని ఎమ్మెల్యే డికె అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న సాగునీటి ఒప్పందాలను నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జరిపారు.

08/24/2016 - 08:43

కరీంనగర్ టౌన్, ఆగస్టు 23: తెలంగాణ రైతాంగం ఆత్మాభిమానాన్ని మహారాష్టక్రు తాకట్టు పెట్టి, మేడిగడ్డ నిర్మాణం కోసం చేసుకుంటున్న మహా ఒప్పందాన్ని కాంగ్రెస్ అధికారంలోకొస్తే పునఃపరిశీలిస్తుందని ఆపార్టీ శాసనసభాపక్ష ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు.

08/24/2016 - 08:42

కరీంనగర్/మహబూబ్‌నగర్/ ఆదిలాబాద్/ ఆగస్టు 23: ప్రభుత్వం విడుదల చేసిన జిల్లాల ముసాయిదాపై కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబా ద్ జిల్లాల్లోని ప్రలు ప్రాంతాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ముసాయిదాలో కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల పేరు లేకపోవడంతో ఆ నియోజకవర్గం ప్రజలు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.

08/24/2016 - 08:41

షాద్‌నగర్ రూరల్, ఆగస్టు 23: గ్యాంగ్‌స్టర్ నరుూం భార్య, అక్క, వాచ్‌మెన్ దంపతుల పోలీస్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జైలుకు తరలించారు.

Pages