S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/26/2016 - 03:42

జగదేవ్‌పూర్, ఆగస్టు 25: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో వరంగల్ జిల్లాకు చెందిన గంగాదేవిపల్లి గ్రామ ప్రజాప్రతినిధులతో పాటు పలువురు గ్రామస్థులు గురువారం పర్యటించారు. వారు గ్రామానికి చేరుకుని ఇక్కడ అమలవుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

08/26/2016 - 03:41

ఆదిలాబాద్, ఆగస్టు 25: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పవార్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎం. జగన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.

08/26/2016 - 03:40

మహబూబ్‌నగర్, ఆగస్టు 25: రాష్ట్రంలో పాలకులు మనకే అన్ని తెలుసని, ఇతరులకు ఏమీ తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అది మూర్ఖత్వమేనని టిజెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని టిఎన్‌జిఓ భవనంలో కెకె మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘ఎవరి అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేయాలి...నేరం ఎవరిది శిక్షలు ఎవరికి’ అనే సదస్సు నిర్వహించారు.

08/26/2016 - 03:38

మహబూబ్‌నగర్, ఆగస్టు 25: భాషపై విద్యాపరమైన విధానాన్ని తయారు చేయాలని, అందుకు తెలుగు ప్రజలంతా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుభాషను రక్షించుకోవడానికి నడుం బిగించాలని తెలుగు భాషా పరిరక్షణ రాష్ట్ర కన్వీనర్ కొండల్‌రావు పిలుపునిచ్చారు.

08/25/2016 - 17:27

వరంగల్ : తెలంగాణ రైతుల హక్కులను కేసీఆర్‌ సర్కార్‌ మహారాష్ట్ర వద్ద తాకట్టు పెట్టిందని, దీనిపై విమర్శించిన ప్రతిపక్షాలపై కేసులు పెడతామనడం సరికాదని టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉందన్నారు. చారిత్రక నగరం వరంగల్‌ను మూడు ముక్కలుగా విభజిస్తుంటే జిల్లా మంత్రి కడియం శ్రీహరి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

08/25/2016 - 17:20

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి ప్రాజెక్ట్‌ల ఒప్పందంపై అబద్దాలు చెబుతున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం విమర్శించారు. 2012లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌-మహారాష్ట్ర మధ్య

08/25/2016 - 16:41

హైదరాబాద్: విమర్శలు చేసేవారిపై కేసులు పెట్టి జైలుకూడు తినిపిస్తానని సిఎం కెసిఆర్ అనడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అహంకారాన్ని తగ్గించుకుని కెసిఆర్ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్టత్రో కెసిఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.

08/25/2016 - 16:41

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్టత్రో చారిత్రక ఒప్పందం చేసుకున్నట్లు సిఎం కెసిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజానికి ఆ ఒప్పందం వల్ల తెలంగాణ రైతులకు ఫలితం ఏమీ ఉండదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి బదులు కేసులు పెట్టి జైలుకూడు తినిపిస్తానని సిఎం బెదరించడం సరికాదన్నారు.

08/25/2016 - 15:54

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల వర్షాలతో వాగులు, పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురవగా, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్షం పడింది.

08/25/2016 - 13:59

హైదరాబాద్‌: కోఠిలోని గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లు సంభవించి తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా నాటి పరిస్థితులను గురువారం అందరూ గుర్తు చేసుకున్నారు. బాంబు పేలుళ్ల మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. గోకుల్‌చాట్‌ ఘటనలో కన్ను కోల్పోయినా ప్రభుత్వం ఇప్పటివరకు తనకు న్యాయం చేయలేదని బాధితుడు రషీద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Pages