S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/25/2016 - 13:55

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం సోదరుడు ఫహీం, అతడి భార్య షాహిన్‌ను గురువారం నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు వీరిద్దరినీ పోలీసులు విచారించనున్నారు. నయీం ఆస్తులు, హత్యల గుట్టు తెలుసుకునేందుకు వీరిని కస్టడీకి తీసుకున్నారు. నయీం ఇంట్లో హత్యకు గురైన బావ నదీమ్‌ మృతదేహం షాద్‌నగర్‌ శివారులో దహనం చేసినట్లు ఫహీం పోలీసులకు తెలిపాడు.

08/25/2016 - 12:54

హైదరాబాద్‌ : నగరంలోని పలుచోట్ల గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, మెహదీపట్నం, టోలీచౌకితో పాటు హయత్‌నగర్‌లోనూ పలుచోట్ల వర్షం కురుస్తోంది. కొద్దిరోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదరకంగా మారిపోయింది. మరోవైపు వర్షంతో పలుచోట్ల వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.

08/25/2016 - 11:32

నల్గొండ: మంత్రి జగదీశ్వర్‌రెడ్డి గురువారం ఉదయం నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేశారు. రోజుకు 8 వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నామని, ఎఎమ్మాఆర్ ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపుతామని మంత్రి తెలిపారు. ఆరు తడి పంటలకే నీటిని విడుదల చేయనున్నారు.

08/25/2016 - 11:06

హైదరాబాద్‌: నగరంలో పలు కృష్ణాలయాల్లో గురువారం ఉదయం నుంచి కృష్ణాష్టమి వేడుకల సందడి నెలకొంది. బారులు తీరిన భక్తులు కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ఇస్కాన్‌ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, వివిద రకాల పుష్ఫాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. హారతి, భజన, తులసి పూజ, పుష్పార్చన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు.

08/25/2016 - 07:01

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 34 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. భౌగోళికంగా 30 నుంచి 35 చ.కిమీ వైశాల్యంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కిడ్నీ రోగుల గణాంకాల ఆధారంగా ఈ ఎంపిక జరిగిందన్నారు.

08/25/2016 - 06:59

హైదరాబాద్, ఆగస్టు 24: నేత్రవైద్య చికిత్సలకు, ఉన్నత స్థాయి వైద్య ప్రమాణాలతో నేత్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందని ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. బుధవారం ఇక్కడ ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ది సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌ను ఐటి రంగ నిపుణులు బి మోహన్ రెడ్డి ప్రారంభించారు.

08/25/2016 - 06:58

హైదరాబాద్/వనస్థలిపురం/ఉప్పల్, ఆగస్టు 24: హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న నలుగురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. నగరంలో అదృశ్యమైన ఈ నలుగురు విద్యార్థులు గోవాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

08/25/2016 - 06:56

హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు డిపిఆర్‌లను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అందజేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

08/25/2016 - 06:49

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ సచివాలయం ‘డి’బ్లాక్‌లో ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ డెవలప్‌మెంట్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరావు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిరశన వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా పెత్తనం చెలాయిస్తున్నారని, సెలవులు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు తెలిపారు.

08/25/2016 - 06:38

కరీంనగర్/ఆదిలాబాద్/వరంగల్/ఆగస్టు 24: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై పలు జిల్లాల్లో నిరసనలు రోజురోజుకి ఉధృమవుతున్నాయి. జిల్లా హోదా దక్కని కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, రెవెన్యూ డివిజన్ హోదా దక్కని కోరుట్ల, ఇతర జిల్లాల్లోకి తమను చేర్చవద్దంటూ హుస్నాబాద్, కోహెడ, ఇల్లంతకుంట తదితర మండలాల్లో నిరసనలు ఉధృతమవుతున్నాయి.

Pages