S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/28/2016 - 03:33

హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి ఇంటికి తాను భోజనానికి వెళతానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఇలాంటి సంప్రదాయం ఉండేదని అన్నారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పుచ్చలపల్లి సుందరయ్య ఇంటికి వెళ్లి మాట్లాడేవారని ఇది మంచి సంప్రదాయం అని కెసిఆర్ అన్నారు.

12/28/2016 - 03:32

హైదరాబాద్, డిసెంబర్ 27: నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించే వారు 20 శాతం వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ వి అనిల్‌కుమార్ తెలిపారు. వేడుకలు నిర్వహించే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు అన్నీ ముందుగా రిజిస్ట్రర్ చేయించుకొని వినోదపు పన్ను చెల్లించాలని చెప్పారు. పన్ను చెల్లించకుండా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

12/28/2016 - 02:42

సిద్దిపేట, డిసెంబర్ 27: దేశంలోనే ద్వితీయ నగదు రహిత గ్రామంగా రాష్ట్రంలో తొలిగ్రామంగా గుర్తింపుపొందిన సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి బిఎస్‌ఎన్‌ఎల్ ఉచిత వైఫై సేవలను అందించేందుకు ముందుకొచ్చింది. పెద్దనోట్లరద్దు తర్వాత నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇబ్రహీంపూర్ రాష్ట్రంలోనే క్యాష్‌లెస్‌గా గుర్తింపు పొందింది.

12/28/2016 - 02:40

బాసర, డిసెంబర్ 27: బాసర అమ్మవారి సన్నిధిలో మంగళవారం భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి అక్షరాభ్యాస మండపంలో తన మనవరాలికి అక్షరాభ్యాస పూజలు జరిపించారు. వీరివెంట ఆలయ సూపరిండెంట్ సాయిలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

12/28/2016 - 02:38

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్రంలో గృహనిర్మాణం విషయంపై శాసనమండలిలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి-ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ మద్య తీవ్రవాగ్వాదం జరిగింది. దాంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్తపరిస్థితి నెలకొంది.

12/28/2016 - 02:37

అమ్రాబాద్, డిసెంబర్ 27: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాలలో యురేనియం ఖనిజ తవ్వకాల కోసం వణ్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ మంగళవారం మండల కేంద్రానికి వచ్చిన జాతీయ టైగర్ ప్రాజెక్టు అథారిటి అధికారి బిలాల్‌జీ, అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్టు ఫీల్డు డైరక్టర్ ఫరిగేన్, డిఎఫ్‌ఓ జోజిలతోపాటు ఇతర అధికారులను వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, ప్రజలు అడ్డుకున్నారు.

12/28/2016 - 02:35

ఆదిలాబాద్, డిసెంబర్ 27: ఉత్తరాది నుండి వీస్తున్న శీతలగాలులతో ఆదిలాబాద్ జిల్లా వణికిపోతోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనం స్తంభించిపోతోంది. ఉట్నూ రు, ఆసిఫాబాద్, బోథ్ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో గడపదాటి బయటకు వెళ్లలేక జనం సతమతమవుతున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో 5.0, ఉట్నూరులో 4.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

12/28/2016 - 02:34

నక్కలగుట్ట,డిసెంబర్ 27: ఏనుమాముల మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీల కూలీ రేట్లను చాంబర్ కామర్స్ పెంచడంపై వివిధ హమాలీ సంఘాల నాయకులు హర్షం వ్యకం చేశారు. మంగళవారం హమాలీ సంఘాల నాయకులతో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కటకం పెంటయ్య, ప్రతి నిధులతో సంయుక్త సమావేశం జరిగింది.

12/28/2016 - 02:34

బచ్చన్నపేట, డిసెంబర్ 27: వరంగల్ రూరల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని దబ్బగుంటపల్లి గ్రామస్థులు వందశాతం ఇళ్లు, నల్లా పన్నులు చెల్లించి అధికారుల మన్ననలు అందుకున్నారు. మంగళవారం ఉదయం 8గంటల నుంచే పంచాయతీ కార్యాలయం వద్ద వరుసలో నిల్చోని బకాయి పన్నులు చెల్లించారు. గత 10 రోజులుగా పంచాయతీ అధికారులు మండలంలో మూడు బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో స్థానిక పన్నులు వసూలు చేస్తున్నారు.

12/28/2016 - 02:33

హైదరాబాద్, డిసెంబర్ 27: శాసనమండలిలో సభ్యులు మాట్లాడే సమయంలో నిబ్బరంగా ఉండాలని, సభలో ఉద్రిక్తత ఏర్పడకుండా మాట్లాడాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ సూచించారు. శాసనమండలిలో గృహనిర్మాణంపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా అధికార-విపక్షాల మధ్య వాగ్వాదం జరగగా, చైర్మన్ జోక్యం చేసుకున్నారు.

Pages