S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/24/2017 - 02:43

హైదరాబాద్, జూన్ 23: బ్రాహ్మణ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం జివో జారీ చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ల సౌకర్యం ఉన్న కులాలకు మాత్రమే తాహసిల్దారు కార్యాలయంలో కుల దృవీకరణ పత్రం ఇచ్చే వాళ్లు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సరస్వతి విద్యా ప్రశస్తి, వివేకానంత విదేశీ విద్యా పథకాలకు కుల దృవీకరణ పత్రం అవసరం ఏర్పడింది.

06/24/2017 - 02:42

హైదరాబాద్, జూన్ 23: ఎన్డీఏ అభ్యర్థికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మద్దతు ఇవ్వడంలోని ఆంతర్యం, రహస్య ఒప్పందం ఏమిటని టి.పిసిసి నాయకుడు, తెలంగాణ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా మద్దతు ఇవ్వడంలోని మతలబు ఏమిటో బయట పెట్టాలని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

06/24/2017 - 02:41

హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో వచ్చే ఏడాది చేపట్టే తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ప్రణాళికను రాష్ట్ర స్థాయి పథకాల మంజూరు కమిటీ ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ సింగ్ అధ్యక్షతన నగరంలోని తాగునీటి సరఫరా విభాగం కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలో అమలవుతున్న తాగునీటి సరఫరా పథకాలు గత ఏడాది పురోగతిని కూడా కమిటీ సమీక్షించింది.

06/24/2017 - 02:41

హైదరాబాద్, జూన్ 23:బిజెపితో టిఆర్‌ఎస్ చీకటి ఒప్పందం అంటూ కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపితో టిఆర్‌ఎస్‌కు చీకటి ఒప్పందం లేదని, ఉన్నదల్లా అభివృద్ధి ఒప్పందం మాత్రమేనని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎన్‌డిఏలో లేదు, యూపిఏలోనూ లేదనే విషయం జైపార్‌రెడ్డి తెలుసుకోవాలని అన్నారు.

06/24/2017 - 02:40

హైదరాబాద్, జూన్ 23: ఎన్డీఏ తరఫున రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మద్దతునివ్వడం ముస్లిం, మైనారిటీలను మోసం చేయడమే అవుతుందని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రామ్‌నాథ్ కోవింద్ లౌకికవాది కాదని మతతత్వవాది అని ఆయన శుక్రవారం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు.

06/24/2017 - 02:39

హైదరాబాద్, జూన్ 23: ఈ ఆర్థిక సంవత్సరానికి గాను (2017-18) రూ.1,14,353 కోట్లతో తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ వార్షిక ప్రణాళికను శుక్రవారం విడుదల చేసింది. గ్రాండ్ కాకతీయ హోటల్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వార్షిక ప్రణాళికను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. ఇందులో పంట రుణాల కోసం రూ.39, 752 కోట్లు కేటాయించింది.

06/23/2017 - 03:01

హైదరాబాద్, జూన్ 22: రాజధాని నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో, పట్టణాల్లో తీవ్ర రూపం దాల్చిన వాహనాల పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నట్టు పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో పోలీసు శాఖ, మున్సిపల్ శాఖాధికారులతో పార్కింగ్ సమస్యపై గురువారం సమావేశం నిర్వహించారు.

06/23/2017 - 02:57

హైదరాబాద్, జూన్ 22: హైదరాబాద్‌లో భారీగా రద్దయిన పాత నోట్లు పట్టుబడ్డాయి. భారత ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో రూ. 1000, రూ. 500 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత నోట్లు మార్పిడీకి ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిశాక అప్పుడప్పుడు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం సుమారు రూ. 7కోట్ల పాత కరెన్సీని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

06/23/2017 - 02:54

హైదరాబాద్, జూన్ 22: ప్రభుత్వ భూముల రక్షణ కోసం కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స చూస్తేనే ప్రభుత్వ డొల్లతనం ఏమిటో ఇట్టే అర్ధం అవుతోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వ భూములకు రక్షణ అనేది ఉంటుందనే నమ్మకం తమకు లేదని పేర్కొన్నారు.

06/23/2017 - 02:31

హైదరాబాద్, జూన్ 22: మియాపూర్ భూముల కుంభకోణంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం సదరు భూముల క్రయ విక్రయాలను రద్దు చేసి తిరిగి భూములను స్వాధీనం చేసుకునే పనిలో తెరాస ప్రభుత్వం పడింది. అందులో భాగంగానే గోల్డ్‌స్టోన్ యాజమాన్యంనుండి కొనుగోలు చేసిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుటుంబ సభ్యుల భూమి రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసిన ప్రభుత్వం సదరు భూములను స్వాధీనం చేసుకుంది.

Pages