S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/23/2017 - 02:28

చేవెళ్ల, జూన్ 22: ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి బోరుబావిలోపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. అక్కా చెల్లెళ్లు పొలం దగ్గర ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిధిలోని యాలాల మండలానికి చెందిన యాదయ్య, రేణుక దంపతులు కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం చన్‌వళ్లి గ్రామానికి వలస వచ్చారు.

06/23/2017 - 02:25

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి -హబ్ తరహాలో జెఎన్‌టియు జె-హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌కు సలహామండలి చైర్మన్‌గా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్, కన్వీనర్‌గా డాక్టర్ విజయకుమారి వ్యవహరిస్తారు. అయితే పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను ఈ సలహామండలిలో భాగస్వామ్యం చేశారు.

06/23/2017 - 02:25

హైదరాబాద్, జూన్ 22: భద్రాచలం దేవస్థానంలో జూలై ఒకటి నుండి డ్రెస్‌కోడ్ అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నివాసంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భక్తులు ఆలయంలోకి సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని, విఐపిలతో సహా ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే, ఆలయంలోకి రానివ్వవద్దని మంత్రి సూచించారు.

06/23/2017 - 02:24

హైదరాబాద్, జూన్ 22: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ ఆత్మహత్య కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్‌లను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. కాగా సదరు పిటిషన్ ఈనెల 24న విచారణకు రానున్నట్టు తెలిసింది.

06/23/2017 - 02:24

హైదరాబాద్, జూన్ 22: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాగోల్‌లో నివాసముంటున్న బుల్లితెర నటి (34)పై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు గురువారం రాచకొండ మహేశ్ ఎం భగవత్ తెలిపారు. గురువారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం తాడిపత్రికి చెందిన పి గిరీష్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు.

06/23/2017 - 02:22

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ రాష్ట్ర పోలీస్ చేపట్టిన స్మార్ట్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవలను దేశవ్యాప్తంగా గుడ్ ప్రాక్టిస్‌గా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈనెల 24న పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో అవార్డు ప్రదానం చేయనుంది. ఈ అవార్డును రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున హైదరాబాద్ నగర కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి అందుకుంటారు.

06/23/2017 - 02:22

హైదరాబాద్, జూన్ 22: రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ, భూదాన్, కాందిశీకులకు చెందిన భూముల అక్రమాలపై సిబిఐతో విచారణ చేయించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సిపిఐ నేతల బృందం గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది.

06/23/2017 - 01:27

గోదావరిఖని, జూన్ 22: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి బొగ్గు గని కార్మికుల పాత్ర కీలకమైందని, గని కార్మికులను విస్మరిస్తే ఊరుకునేది లేదని... సింగరేణి కార్మికులకు వారసత్వాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని అమలు చేయకుంటే గద్దె దింపుతామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

06/23/2017 - 01:25

మహబూబాబాద్, జూన్ 22: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ బిసి మైనార్టీ విద్యార్థులకు 510 గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో నూతనంగా మంజూరైన కస్తూర్బా గాంధీ ఇంగ్లీషు మీడియం బాలికల పాఠశాలను ఆయన గురువారం ప్రారంభించారు.

06/23/2017 - 01:23

నిజామాబాద్, జూన్ 22: ప్రాంతీయ అసమానతలను రూపుమాపే విధంగా, వివక్షకు తావులేని అభివృద్ధికే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఏ ఒక్కరు కూడా మోదీ సర్కార్ తమకు నిధులు కేటాయించడం లేదంటూ ఆక్షేపణ చేయడం లేదని అన్నారు.

Pages