S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/06/2017 - 01:36

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ‘విప్రహిత బ్రాహ్మణ సదన్’ భవన నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి గచ్చిబౌలి సమీపంలోని గోపన్‌పల్లిలో 6.10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన బ్రాహ్మణ సదన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. వాస్తవంగా ఈ శంకుస్థాపన ముఖ్యమంత్రి కె.

06/06/2017 - 01:34

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రంలో 29 జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లతోపాటు, రెండేసి జిల్లాలకు ఒకరిచొప్పున 16మంది మహిళా ఆర్గనైజర్లను సిఎం కె చంద్రశేఖర్‌రావు సోమవారం నియమించారు. వీరికి నెలకు రూ.51 వేల గౌరవ వేతనంతోపాటు రూ.25 వేల ప్రయాణ భత్యంగా చెల్లించనున్నట్టు ప్రకటించారు. గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, మహిళా ఆర్గనైజర్ల పదవీకాలం రెండేళ్లపాటు ఉంటుంది.

06/05/2017 - 04:10

హైదరాబాద్, జూన్ 4: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కొత్తగా 8.73 లక్షల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర భారీ సాగునీటిపారుదల శాఖ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల రంగంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 6.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించారు.

06/05/2017 - 04:08

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్ర కమిటీని త్వరలో ప్రకటించనున్నట్టు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర కమిటీ కూర్పుపై పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. దీంట్లో భాగంగా ఆరు అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ఆదివారం ముఖ్యమంత్రి ప్రకటించారు.

06/05/2017 - 04:07

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరారు. నాడు నిజాం నవాబు పరిపాలనలో జాగిర్దారులు, జమీందార్లు, భూస్వాముల అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడి చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

06/05/2017 - 02:14

హైదరాబాద్, జూన్ 4: వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలకు జీవన భృతి చెల్లించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టింది. రాష్టవ్య్రాప్తంగా 119 నియోజకవర్గాల్లో 150 కేంద్రాలు ఏర్పాటు చేసి ఒంటరి మహిళలకు ఫించన్లు అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచే ఒంటరి మహిళలకు ఫించన్లు చెల్లించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.

06/05/2017 - 02:12

హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణం నిందితుల బెయిల్ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ జరుపనుంది. ఈ స్కాంలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు బెయిల్ కోరుతూ ఇటీవల దాఖలు చేసుకున్న పిటిషన్ కోర్టు కొట్టివేసింది. తాజాగా సోమవారం ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించనుంది. అదేవిధంగా ఈ కేసు విచారణ కోసం పోలీసులు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరుగనుంది.

06/04/2017 - 02:30

హైదరాబాద్, జూన్ 3: గర్భిణీలు, బాలింతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకునే మహిళలకు ఆర్థిక దన్నునిచ్చే ‘కెసిఆర్ కిట్’ పథకాన్ని ప్రారంభించారు. శనివారం నగరంలోని పెట్ల బుర్జు ఆస్పత్రిలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో సిద్దిపేటలో హరీశ్‌రావు, రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు పథకాన్ని ప్రారంభించారు.

06/04/2017 - 02:08

హైదరాబాద్, జూన్ 3: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాల పతనానికి సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అడ్డగోలు వాగ్దానాల కొత్త సంస్కృతిని తీసుకుని వచ్చారని ఆయన విమర్శించారు.

06/04/2017 - 02:07

హైదరాబాద్, జూన్ 3: రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందని, ఉత్తర ప్రదేశ్‌లో రాహుల్ వల్లనే అఖిలేష్ యాదవ్ ఓడిపోయారని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై ధ్వజమెత్తారు. బాలానగర్‌లో శనివారం జరిగిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో నిన్న గాక మొన్న రాహుల్‌గాంధీ అని ఒకాయన వచ్చారు అంటూ కెటిఆర్ విమర్శలు చేశారు.

Pages