S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/11/2017 - 02:29

హైదరాబాద్, మే 10: కేంద్రప్రభుత్వం సహకరిస్తున్నా ఆ సహకారాన్ని స్వీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా లేదని బిజెపి శాసనసభాపక్ష నాయుకుడు జి కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ఆర్థిక మద్దతుతో ముందుకు వచ్చినా, మిర్చి రైతుల నుండి సకాలంలో మిర్చి కొనుగోలులో విఫలమైందని, ఫలితంగా మిర్చి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

05/11/2017 - 02:29

హైదరాబాద్, మే 10: ఉద్యాన పంటలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే విధంగా పరిశోధనలు జరగాలని తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సూచించారు. ఈనెల మూడో వారంలో జరగనున్న జోనల్ స్థాయి పరిశోధన, విస్తరణ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం అజెండాపై చర్చించేందుకు బుధవారం ప్రత్యేక సమీక్ష జరిగింది.

05/11/2017 - 02:28

హైదరాబాద్, మే 10: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నందిని సిధారెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు కావాలని తాను కలలు కన్నానని, తన కలలు నిజమయ్యాయని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

05/11/2017 - 02:27

హైదరాబాద్, మే 10: ఖమ్మం పట్టణంలో రైతుల సమస్యలపై రెండు రోజుల పాటు దీక్ష చేపట్టేందుకు అనుమతివ్వాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి డిజిపి అనురాగ్ శర్మను కోరారు. ఈ మేరకు ఆయన ఒక వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు రోజుల దీక్ష చేపడుతున్నామని, ఇందుకు అనుమతించాలని ఖమ్మం పోలీసు కమిషనర్‌కు ఇప్పటికే దరఖాస్తు చేశామని తెలిపారు.

05/11/2017 - 02:27

హైదరాబాద్, మే 10: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. తమ సమస్యల జాబితాతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి హామీ ఇస్తూ సమస్యల పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నరసయ్య, ఈ.నవనీతరావు తెలిపారు.

05/11/2017 - 01:01

హైదరాబాద్, మే 10: ఆదిలాబాద్ జిల్లా యాపలగూడ గ్రామ శివారులో ఇండియన్ రిజర్వు పోలీస్ బెటాలియన్ ఏర్పాటు కోసం 111.37 ఎకరాలు కేటాయిస్తూ రెవిన్యూశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉచితంగానే కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆదిలాబాద్ మండలం బట్టిస్వరగాన్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం, సిబ్బంది వసతి గృహాల నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయిస్తూ రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

05/11/2017 - 01:01

హైదరాబాద్, మే 10: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి జి.రఘుమారెడ్డి వెల్లడించారు.

05/11/2017 - 01:00

హైదరాబాద్, మే 10: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రమాద ఘటనలో నిషిత్, రాజారవివర్మ దుర్మరణం ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు తరచుగా జరిగే 324 బ్లాక్ స్పాట్స్‌ను సరిదిద్దాలని ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై మొత్తం 324 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి.

05/10/2017 - 08:14

హైదరాబాద్, మే 9: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని నాందేడ్-తిరుపతి ప్రత్యేక రైలు నెం. 07607 పట్టాలు తప్పింది. మంగళవారం రాత్రి గం. 20:27లకు ఈ సంఘటన చోటుచేసుకుంది.

05/10/2017 - 07:46

హైదరాబాద్, మే 9: మరో పదిహేను రోజుల్లో మిషన్ కాకతీయ మూడో దశ పనుల గ్రౌండింగ్ 90శాతం పూర్తి కావాలని నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయపై అధికారులతో మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు. మిషన్ కాకతీయ 1,2దశలలో ఇంకా పూర్తి కాని పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని చెప్పారు.

Pages