S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/20/2016 - 14:01

ఆదిలాబాద్ : ఆసిఫాబాద్ చెక్‌పోస్టు వద్ద అటవీశాఖాధికారులు, సిబ్బంది ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 40 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

03/20/2016 - 13:59

హైదరాబాద్ : నగరంలోని ఎల్‌బీ నగర్ దగ్గర ఆర్‌టీఏ అధికారులు ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 బస్సులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.

03/20/2016 - 13:55

మెదక్: సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి 23 వరకూ నామినేషన్ల స్వీకరణ, 24న వాటి పరిశీలన, 25న ఉపసంహరణ, ఏప్రిల్ 6న పోలింగ్, 11న కౌంటింగ్ జరుగుతాయని అధికారులు ప్రకటించారు.

03/20/2016 - 07:33

హైదరాబాద్: నల్సార్ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయంలో నల్సార్, ల్యాండెన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘్భమికి సంబంధించిన న్యాయ సేవలు- పేదలు అవసరాలు’ అనే అంశంపై సదస్సును సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిల్ ఆర్ దవే ప్రారంభించారు.

03/20/2016 - 07:32

హైదరాబాద్: ఉద్యమ కాలంలో చెప్పిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సభను ఇష్టమొచ్చినట్టుగా నిర్వహించుకుంటున్నారని, స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తుండటంతో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోతుందని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టులా సభను నడుపుతున్నారని, ప్రతిపక్ష సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకూ సమాధానాలివ్వకుండా దాటవేస్తున్నారని విమర్శించారు.

03/20/2016 - 07:31

హైదరాబాద్: బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి వ్యవహారంపై శనివారం శాసన మండలి సమావేశంలో దుమారం రేగింది. చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిపేందుకు అనుమతించారు. దీంతో ప్రతిపక్ష సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి బడ్జెట్‌పై తన అభిప్రాయాన్ని తెలిజేస్తూనే, కాంగ్రెస్ హయంలో బీబీనగర్‌లో నిర్మించిన ఎయిమ్స్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవటాన్ని తప్పుబట్టారు.

03/20/2016 - 07:29

గజ్వేల్: మైనారిటీల సంక్షేమానికి టిఆర్‌ఎస్ సర్కార్ పెద్దపీట వేస్తుండగా, ఠూ.1400కోట్లతో 70 మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టినట్లు మైనారిటీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, మైనారిటీ కళాశాలల సెక్రెటరీ షఫియుల్లా స్పష్టం చేశారు. శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణ శివారులో మైనారిటీ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

03/20/2016 - 07:28

హైదరాబాద్: బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వచ్చే ఏడాది బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలను కేటాయించారని, అన్ని వర్గాల సంక్షేమానికి కేటాయింపులు అద్భుతంగా ఉన్నాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ అన్నారు. దేశాన్ని 14 మంది ప్రధానులు పరిపాలించారని, ఇందులో 8 మంది బ్రాహ్మణులేనని చెప్పారు.

03/20/2016 - 07:18

హైదరాబాద్: విద్యార్థి అభయ్ హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. విద్యార్థి తండ్రి రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు అభయ్ హత్యకు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారి రాజ్‌కుమార్ సమీప బంధువు ఒకరు కక్షసాధింపుతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

03/20/2016 - 06:44

నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యుల ఆధ్వర్యంలోని అర్చక బృందం ఉదయం 11గంటలకు యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు.

Pages