S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/03/2017 - 01:12

హైదరాబాద్, మే 2: గీతం విశ్వవిద్యాలయం బిటెక్, ఎంటెక్, బి ఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను ఈ నెల 5వ తేదీన వెల్లడించనున్నారు. హైదరాబాద్ ప్రాంగణంతో పాటు దేశవ్యాప్తంగా 48 కేంద్రాల్లో గీతం పరీక్షకు 70వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో పరీక్షకు 90 శాతం మంది హాజరయ్యారని అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె నరేంద్ర పేర్కొన్నారు.

05/03/2017 - 01:12

హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగ సమస్యలకు త్వరలో పరిష్కారం లభించే విధంగా కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. తెలంగాణ సమస్యలపై దత్తాత్రేయ అధికారులతో సమీక్షించారు.

05/03/2017 - 01:11

హైదరాబాద్, మే 2: ఇటీవల ప్రకటించిన జెఇఇ మెయిన్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థి తమ వద్దే శిక్షణ పొందాడంటే తమ వద్ద శిక్షణ పొందాడంటూ కార్పొరేట్ కాలేజీల మధ్య జరిగిన మాట యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారింది.

05/02/2017 - 04:19

హైదరాబాద్, మే 1: ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం తప్ప చాలా మంది తెరాస నేతలు కాం గ్రెస్‌లో చేరేందుకు తనతో టచ్‌లో ఉన్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడిం చారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేఖరులతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లడుతూ, రాష్ట్రం లో బిజెపికి బలం లేదని, కేవలం హిందూ ఓట్లపై ఆధారపడి ముందుకెళుతోందని ఉత్తరాదిలో బిజెపి బలపడినా, దక్షిణాదిలో ఆ పార్టీకి అంత శక్తి లేదన్నారు.

05/02/2017 - 04:17

గోదావరిఖని, మే 1: పెద్దపల్లి జిల్లా గోలివాడలో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో చేప డుతున్న మేడిగడ్డ ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణ పనులు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. అదిచినికి చినికి గాలివానలా మారి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ పంప్‌హౌస్ పనులను సోమవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు.

05/02/2017 - 04:16

హైదరాబాద్, మే 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయేషామీరా తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఆయేషా హత్యకేసులో నిర్దోషిగా విడుదలైన సత్యం బాబు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ నిర్భయ కేసులో ఎలాంటి న్యాయం జరిగిందో ఆయేషా కుటుంబానికి అలాంటి న్యాయమే జరగాలని అత డు తెలిపాడు. ఈ కేసులో మొదటి నుంచి తాను నిర్దోషినేనని చెబుతూ వచ్చానని, చివరికి న్యాయమే గెలిచిందని చెప్పాడు.

05/02/2017 - 04:16

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావుకు ఉత్తమ నిర్వహణ పురస్కారం (బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు) లభించింది. కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, కార్మికశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

05/02/2017 - 02:59

న్యూఢిల్లీ, మే 1: మెగా ఫుడ్‌పార్క్ పాలసీలో భాగంగా తెలంగాణకు కొత్తగా నాలుగు ఫుడ్‌పార్క్‌లను మంజూరు చేయాలని కేంద్రానికి మంత్రి కె తారక రామారావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, మనోజ్ సిన్హాలతో సమావేశం అయ్యారు.

05/02/2017 - 02:57

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నకిలీ విత్తనాల బెడద లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్షించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిని జైలుకు పంపించే విధంగా కఠినమైన చట్టం రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

05/02/2017 - 02:52

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు డ్రైవింగ్ స్కూళ్లు లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తుండగా, ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్ల సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గిపోతోంది. డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చిన శిక్షణతో గత పదేళ్లలో సుమారు 10 లక్షల మంది యువతకు డ్రైవర్లుగా ఉపాధి లభించింది. అంటే ఏటా సరాసరిన లక్ష మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.

Pages