S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/01/2017 - 23:46

హైదరాబాద్, మే 1: తమ హక్కుల పరిరక్షణ, సమస్యల సాధనకు ధర్నా చౌక్‌ను పునరుద్దరించాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాలబాలికలు నిరసన దీక్ష నిర్వహించారు. సోమవారం మగ్ధుంభవన్‌లో నిర్వహించిన దీక్ష శిబిరంలో పలువురు బాలబాలికలు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ వెంటనే ధర్నా చౌక్‌ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. 10 నుంచి పిజి వరకు చదువుతున్న బాలబాలికలు ఈ ధర్నా నిర్వహించారు.

05/01/2017 - 03:58

హైదరాబాద్, ఏప్రిల్ 30: కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు రూ. 1000 రూ. 500ల హైదరాబాద్‌లో ఇంకా పట్టుబడుతున్నాయి. పెద్ద నోట్లు రద్దయి ఐదు నెలలు గడిచినా హైదరాబాద్‌లో కొన్ని ముఠాలు రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి ఇంకా కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్, సికిందరాబాద్‌లో రద్దయిన పాత నోట్ల మార్పిడికి పాల్లడుతోన్న 8 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

05/01/2017 - 03:56

హైదరాబాద్/శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30: హైదరాబాద్ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో ఆదివారం వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వేములపల్లి వినీలకు, హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ జయసింహతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. కాగా వీరికి ఇద్దరు నాలుగేళ్లు, మూడేళ్ళు సంతానం.

05/01/2017 - 03:54

హైదరాబాద్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నదని టి. జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఆరోపించారు. భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్ (సేవ్ ధర్నా చౌక్ శిబిరం)లో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి ప్రొఫెసర్ కోదండరామ్ హాజరై మద్దతు ప్రకటించారు.

05/01/2017 - 03:53

గజ్వేల్, ఏప్రిల్ 30: రాజ్యాంగం కల్పించిన హక్కులను సిఎం కెసిఆర్ కాల రాస్తున్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్ జి ల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఏఐసిసి నేత దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు.

05/01/2017 - 02:58

హైదరాబాద్, ఏప్రిల్ 30: భూ సేకరణ బిల్లుపై రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

05/01/2017 - 02:57

హైదరాబాద్, ఏప్రిల్ 30: అసెంబ్లీ సమావేశానికి అనుమతించకపోవడంపై బిజెపి ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై రుసరుసలాడారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద ఆదివారం బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు కొంత సేపు నిరసన దీక్ష చేపట్టారు.

05/01/2017 - 02:54

హైదరాబాద్, ఏప్రిల్ 30: శనివారం కన్నుమూసిన ప్రభుత్వ సాగునీటి రంగం సలహాదా రు ఆర్ విద్యాసాగర్‌రావు పార్థివ దేహానికి ఆదివారం ఇక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంబర్‌పేట శ్మశాన వాటికలో విద్యాసాగర్‌రావు చితికి ఆయన కుమారుడు వెంకటరమణ నిప్పంటించారు. పోలీసు బెటాలియన్ గౌరవ సూచకంగా గాలిలోకి మూడు రౌండ్లు కాల్చి, గౌరవ వందనం సమర్పించింది.

05/01/2017 - 02:51

హైదరాబాద్, ఏప్రిల్ 30: భగవత్ రామానుజులు అభ్యుదయవాది అని, సమాజంలో హెచ్చుతగ్గులు లేకుండా, ప్రజలంతా సమానమేనని ఆచరణలో చూపించారని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సందర్భంగా శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ నేతృత్వంలో ఆదివారం నెక్లెస్ రోడ్డులో ‘సమతార్యాలీ’ నిర్వహించారు. దాదాపు వెయ్యికార్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి.

05/01/2017 - 02:45

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 2013 భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లును తిరస్కరించాలని టి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జీని కోరారు. ఈ మేరకు త్వరలో రాష్టప్రతిని కలిసి బిల్లును శాసనసభలో ఆమోదించిన ప్రభుత్వ తీరును వివరిస్తామని, బిల్లును తిరస్కరించి రైతాంగ ప్రయోజనాలను కాపాడలని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు.

Pages