S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/01/2017 - 02:43

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఏప్రిల్ 30: అతి ముఖ్యమైన భూసేకరణ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లుపై ఎలాంటి చర్చజరపకుండా కేవలం ఐదు నిమిషాల్లో ఆమోదించి సభను ముగించడం సిగ్గుచేటని కాంగ్రెస్ శాసనసభ పక్షం మండిపడింది. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరమని పేర్కొంది. యావత్ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి సైతం లేకుండా ఆమోదించుకోవడం ఏమిటని సిఎల్‌పి నేత జానారెడ్డి నిలదీశారు.

05/01/2017 - 02:42

హైదరాబాద్, ఏప్రిల్ 30: ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 38 కేసులు వేసిందని, శాసన మండలి, శాసన సభలో ఆదివారం ఆమోదించిన బిల్లు వల్ల కేసులు వీగిపోతాయనేది కాంగ్రెస్ భయం అని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శాసన సభలో, మండలిలో బిల్లు ఆమోదం పొందిన తరువాత హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.

05/01/2017 - 02:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: స్కైవేల నిర్మాణాలకు హైదరాబాద్‌లో అవసరమైన 100 ఎకరాల రక్షణ భూమిని తెలంగాణకు కేటాయించాలని మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్, ఎంపీలు జీతేందర్‌రెడ్డి, వినోద్ కుమార్‌లు కేంద్ర ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.

05/01/2017 - 02:39

హైదరాబాద్, ఏప్రిల్ 30: భారత రక్షక దళాలకు చెందిన సైనికులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ మొదలగునవి)కు చెందిన సిబ్బంది తమ విధి నిర్వహణలో తీవ్రవాదులు, ఉగ్రవాదుల వల్ల ప్రాణాలు కోల్పోతే వారి పిల్లలకు చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐఎఎస్ అధికారుల సంఘం నిర్ణయించింది.

05/01/2017 - 02:39

సిద్దిపేట, ఏప్రిల్ 30 : సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పోలీసులు ఆక్రమ ఆయుధాలు కలిగిన నల్గురు వ్యక్తులను ఆదుపులోకి తీసుకుని, మూడు తుపాకులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే సోదరుడు రాంచందర్, మరో వ్యక్తిని సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు, తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

05/01/2017 - 04:03

భీమదేవరపల్లి, ఏప్రిల్ 30: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ములకనూరు సహకార బ్యాంకు రైతులకు సేవలందించడంలో ప్రపంచ దేశాలు ఆదర్శం అని ఎఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులోని సహకార గ్రామీణ బ్యాంకును ఆయన ఆదివారం సాయంత్రం సందర్శించారు.

05/01/2017 - 00:33

హైదరాబాద్, ఏప్రిల్ 30: ‘్భరత్ బాహుబలి మోదీయే..’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తాను బాహుబలి సినిమాను చూశానని, సినిమా అద్భుతంగా ఉందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కాంగ్రెస్‌ను కాపాడేందుకు బాహుబలి వస్తున్నాడంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓ విలేఖరి ప్రస్తావించగా, ఆయన నవ్వుతూ తేలిగ్గా తోసిపుచ్చారు.

05/01/2017 - 00:32

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని, చట్టాన్ని నిర్దేశించిన కాలపరిమితిలో నోటిఫై చేయడంలో జాప్యం చేసింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు స్థానం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం రియల్ ఎస్టేట్ అథారిటీ చట్టాన్ని గత ఏడాది ఆమోదించడం విశేషం.

04/30/2017 - 09:12

ఖమ్మం, ఏప్రిల్ 29: మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ జరుగుతున్న ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో శనివారం ఖమ్మం జిల్లాలో పోలీసుల నిర్బంధం కొనసాగింది. జిల్లాలోకి వచ్చిన పార్టీల నేతలను వారి కార్యాలయాల నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంత మందిని జిల్లా సరిహద్దులోనే అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

04/30/2017 - 06:46

అధికారిక లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
భౌతిక కాయం వద్ద కెసిఆర్ కన్నీటి నివాళి
ఒక ప్రాజెక్టుకు పేరు పెట్టాలని నిర్ణయం
చంద్రబాబు, జగన్ సహా పలువురి సంతాపం

Pages