S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/28/2017 - 03:16

వరంగల్, ఏప్రిల్ 27: బహిరంగ సభ పుణ్యమాని సామాన్య ప్రజలకు ఆర్టీసి బస్సులు లేకుండా పోయాయి. వరంగల్ రీజియన్ పరిధిలో సుమారు తొమ్మిది వందల బస్సులు ఉండగా అందులో 80శాతానికి పైగా తెరాస బహిరంగ సభకు అద్దెకు తీసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

04/28/2017 - 02:09

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఆధునికతను సంతరించుకుంటూనే విద్యాసంస్థలు విలువలు, సంస్కృతిని మేళవించుకుంటూ ఎదగాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల జాతీయ సమ్మేళనాన్ని ఆయన గురువారం సాయంత్రం యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభించారు.

04/28/2017 - 02:08

హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ భూసేకరణ సవరణ చట్టాన్నికేంద్ర న్యాయ శాఖ మార్పులు చేయాలని తిప్పి పంపిన అంశంపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది.

04/28/2017 - 02:08

హైదరాబాద్, ఏప్రిల్ 27: భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట పరిధిలోని దేవునిగుట్టలోని ప్రభుత్వం భూమిలో పాతికేళ్లుగా వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న తమపై ఫారెస్టు అధికారులు అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచారని, విచారణకు ఆదేశించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గిరిజన తెగ గొత్తి కోయలు గురువారం రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

04/28/2017 - 02:07

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఉన్నత విద్యారంగం నాశిరకంగా తయారవుతోందని, దానికి కారణం ప్రమాణాలు కొరవడటమేనని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్ పేర్కొన్నారు. ఇదో వేలం వెర్రిలా తయారైందని , యూనివర్శిటీల్లో ఉద్యోగానికి వచ్చిన వారు కనీసం ఆ దరఖాస్తు రాయడం కూడా రావడం లేదని, నాశిరకం పిహెచ్‌డిలతో ఉద్యోగాలకు రావడం వల్ల విద్యార్ధులు కూడా అదే రకంగా తయారవుతున్నారని అన్నారు.

04/28/2017 - 02:06

హైదరాబాద్, ఏప్రిల్ 27: దేశ రాజకీయలో ఓయూ విద్యార్థులే కీలక పాత్ర పోషిస్తున్నారని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు.

04/28/2017 - 02:06

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ బూటకమేనని, కేంద్రప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లను వెంటనే ఆపేయాలని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి వికల్ప్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాకు ఒక వాయిస్ ప్రకటన విడుదల చేశారు. దండకారణ్యంలో పోలీసులు మారణ హోమం సృష్టిస్తున్నారని, ప్రజల కోసం పోరాడే క్రాంతికార్ ఆందోళనకారులను హతమారుస్తున్నారని ఆయన ఆరోపించారు.

04/28/2017 - 01:11

హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్‌లో ఏర్పాటు చేసిన సభకు రూ. 100 కోట్లు వసూలు చేశారని, మంత్రుల అక్రమ వసూళ్లపై సిబిఐ చేత విచారణ జరిపించాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

04/28/2017 - 01:11

హైదరాబాద్, ఏప్రిల్ 27: జిహెచ్‌ఎంసి పరిధిలోని హోటళ్లలో పరిశుభ్రత కోసం పాటిస్తున్న నియమాలు, హోటళ్లపై జరిమానా విధించడాన్ని జెసి దివాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ అభినందించింది. హోటళ్లలో ఆహార పదార్థాల పరిశుభ్రత కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రకటించింది. జెసి దివాకర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు.

04/28/2017 - 01:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: మూడేళ్ల పాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి మేలు చేసిందో చెప్పాలని కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో గురువారం వారు విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్టల్రో రైతులు సమస్యలలో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఆదుకోవలసింది పోయి ప్రజాధనాన్ని ప్లీనరీలు, బహిరంగ సభల పేరుతో వృథా చేస్తుందని ఆరోపించారు.

Pages