S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/06/2017 - 06:44

హైదరాబాద్, ఏప్రిల్ 5: దేశంలో మరోసారి రామరాజ్యం రావాలని, దాంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతోందని విహెచ్‌పి అగ్రనేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం హైద రాబాద్‌లో జరిగిన భారీ శోభాయాత్రలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో గత 70 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా, ఆలయాన్ని నిర్మించలేకపోయామన్నారు.

04/06/2017 - 06:26

ఖమ్మం, ఏప్రిల్ 5: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం క్షేత్రంలో చలువ పందిళ్లు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా సాగింది. కన్నులపండువగా జరిగిన కల్యాణాన్ని భక్తులు తిలకించి పులకించారు. వేదమంత్రాల మధ్య కల్యాణ రాముడు సీతమ్మ మెడలో జనక, దశరథ, రామదాసులు తయారు చేయించిన మూడు మంగళసూత్రాలతో మాంగల్యధారణ చేశారు.

04/05/2017 - 03:02

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధికారం చేపట్టిన తర్వాత ఇంతకాలం ప్రభుత్వంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇక నుంచి పార్టీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించబోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంస్థాగతంగా పార్టీకి గట్టి పునాది ఉండాలని ఆయన భావిస్తున్నారు.

04/05/2017 - 03:00

హైదరాబాద్, ఏప్రిల్ 4: యావత్ దేశానికే మిషన్ కాకతీయ మోడల్‌గా నిలుస్తుందని, మిషన్ కాకతీయ వల్ల తెలంగాణతో దేశానికి అనుసంధానం అయిందని కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ సికెఎల్ దాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్ల బృందం రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం అమలును అధ్యయనం చేశారు. అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో మంగళవారం సమావేశం అయ్యారు.

04/05/2017 - 02:28

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో రబీలో పండిన వరిధాన్యం కొనుగోలును బుధవారం నుండి ప్రారంభిస్తున్నామని, త్వరలోనే మిరప చట్టం (మిర్చి యాక్ట్) తీసుకువస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన రైతులకు సీజన్ ముగియక ముందే నష్టపరిహారం ఇప్పించామని మంత్రి తెలిపారు.

04/05/2017 - 02:27

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాజకీయాల్లో నైతికత చాలా ముఖ్యమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, ఇక్కత తమ ప్రయోగం విజయవంతం అవుతుందని అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దక్షిణాదిన కూడా పార్టీ బలోపేతానికి బిజెపి అధిష్టానం దృష్టిపెట్టిందని అన్నారు.

04/05/2017 - 00:53

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రయాణీకులకు ఆర్టీసి బస్టాండ్లలో కనీస మంచి నీటి సదుపాయాన్ని కల్పించడం టిఎస్‌ఆర్టీసి బాధ్యతని, కరీంనగర్ ఆర్టీసి బస్టాండ్‌లో మంచి నీటి సదుపాయంపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు టిఎస్‌ఆర్టీసిని ఆదేశించింది. తెలంగాణ సిటిజన్స్ సంక్షఏమ సంఘం దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

04/05/2017 - 00:52

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రాజెక్టులు నిర్మించాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేస్తారు, ప్రాజెక్టులు నిలిపివేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళతారు కాంగ్రెస్ నాయకులది ద్వంద్వ నీతి అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కర్నె ప్రభాకర్, చింతా ప్రభాకర్‌లు మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

04/05/2017 - 00:51

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో నిఘా వ్యవస్ధను పటిష్టం చేసేందుకు హోంశాఖ ప్రణాళికను ఖరారు చేసింది. ఆరు చోట్ల కొత్తగా ప్రాంతీయ నిఘా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్, రాచకొండ, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్ పోలీసు కమిషనరేట్లలో ఆరు ప్రాంతీయ నిఘా విభాగాలను ఏర్పాటు చేస్తారు.

04/05/2017 - 00:50

హైదరాబాద్, ఏప్రిల్ 4: వచ్చే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా మిషన్ 2019ని ఖరారు చేస్తున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక జనంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వెళ్లి కెసిఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు.

Pages