S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/05/2017 - 00:49

హైదరాబాద్, ఏప్రిల్ 4: యాసంగిలో రికార్డు స్థాయిలో వరి పంట పండింది. 37లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. 2015-16 రబీలో 1286కొనుగోలు కేంద్రాల ద్వారా 8.42లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈసారి నాలుగింతల దిగిబడి పెరిగింది. ధాన్యం ఏ గ్రేడు క్వింటాలు 1510, సాధారణ రకం క్వింటాలు 1470 రూపాయల ధర చొప్పున కొనుగోలు చేస్తారు.

04/05/2017 - 00:39

హైదరాబాద్, ఏప్రిల్ 4: పదో తరగతి పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నాపత్రానికి బదులు ఆంధ్రా ప్రశ్నాపత్రం ఇచ్చిన విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ నిర్వాకంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాల వద్ద మంగళవారం నాడు తల్లిదండ్రులు, విద్యార్థులు వచ్చి ధర్నా నిర్వహించారు.

04/05/2017 - 00:38

హైదరాబాద్, ఏప్రిల్ 4: గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి తెలంగాణలో భూగర్భ నీటి మట్టం పెరిగింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 4.84మీటర్ల పెరుగుదల కనిపించింది. నిరుడు మార్చిలో 14.37మీటర్లు రాష్ట్ర సగటు నీటిమట్టం కాగా, ఈసారి మార్చిలో 10.90 మీటర్లుగా నమోదైందని, 3.41మీటర్ల పెరుగుదల ఉందని భూగర్భ జల శాఖ తెలిపింది. మార్చి నెల భూ గర్భ జల స్థితిగతులపై నివేదిక విడుదల చేసింది.

04/05/2017 - 00:37

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే డిఎఫ్‌ఆర్‌సికి చట్టబద్ధత కల్పించాలని తీర్మానించింది. కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ టి తిరుపతిరావు అధ్యక్షతన సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఫీజుల నియంత్రణ జరగాల్సిందేనని కమిటీ అభిప్రాయపడింది.

04/05/2017 - 00:36

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం 20 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో ఐసియూలో 10 బెడ్స్ ఉంటాయి. దీని కోసం రాష్ట్రప్రభుత్వం రూ.29.44 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో సీనియర్ డాక్టర్లను నియమించనున్నారు.

04/05/2017 - 00:35

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రజలతో చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రజాభీష్టానికి భిన్నంగా మరో పార్టీలోకి ఫిరాయిస్తే ఆ సభ్యునిపై చర్య తీసుకునే అధికారం ఆయా చట్ట సభల స్పీకర్లకు అధికారం ఇవ్వకుండా, కేంద్ర ఎన్నికల సంఘానికి (సిఇసి) ఇవ్వాలని ‘లా’ కమిషన్ చాలా గట్టిగా వాదిస్తోంది.

04/04/2017 - 03:59

భద్రాచలం, ఏప్రిల్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన కల్యాణ మహోత్సవానికి శ్రీరామదివ్యక్షేత్రం భద్రాచలం ముస్తాబైంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం స్వామి వారి కల్యాణం, గురువారం మహాపట్ట్భాషేకం జరుగనున్నాయి. కల్యాణానికి ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురానున్నారు.

04/04/2017 - 03:58

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, తన దగ్గర సిఎం కెసిఆర్ చేసిన అవినీతి చిట్టా అంతా సిద్ధంగా ఉందని, త్వరలోనే ప్రజలముందు నిరూపిస్తానని, కోర్టుల ద్వారా కూడా ఆయన అవినీతిని బట్టబయలు చేస్తానని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

04/04/2017 - 03:57

భువనగిరి, ఏప్రిల్ 3: దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రజానీకం దేశ ప్రధాని నరేంద్రమోదీ వైపు చూస్తున్నారని, ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించామని బిజెపి జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

04/04/2017 - 03:56

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గంలోని కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయంటూ ఏకంగా హైదరాబాద్ - రాయిచూర్ వెళ్లే 147 జాతీయ రహదారిని దిగ్బంధించి గంటల తరబడి రోడ్డుపై రైతులు బైఠాయించారు. దాంతో వాహనాల రాకపోకలకు ఆంతరాయం ఏర్పడింది.

Pages