S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/04/2017 - 03:09

హైదరాబాద్, ఏప్రిల్ 3: ట్రాన్స్‌పోర్టు సంఘాలతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఏ) సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో లారీల సమ్మె మరింత ఉద్ధృతమైంది. సోమవారం పలు ప్రాంతాల్లో లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాస్తారోకో, వంటావార్పుతో నిరసనలు వ్యక్తం చేశారు.

04/04/2017 - 03:08

సైదాబాద్, ఏప్రిల్ 3: దళారుల కుమ్మకుతో నష్టపోతున్న మిర్చీరైతుల విషయంలో ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ చూపి వారికి గిట్టు బాటుధర కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మిర్చి రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మలక్‌పేట మహబూబ్‌మాన్షన్ మార్కెట్ యార్డులో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

04/04/2017 - 03:10

హైదరాబాద్/కాచిగూడ, ఏప్రిల్ 3: ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు ఐదుగురు సహచరులు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక సభ్యుల విడుదల కోసం సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ (సిడిఆర్‌ఓ) తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ప్రొఫెసర్ జిఎస్ సాయిబాబా విడుదల పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభను నిర్వహించారు.

04/04/2017 - 02:39

హైదరాబాద్, ఏప్రిల్ 3: చెరువులు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు హెచ్చరించారు. కబ్జాకు గురైన చెరువులపై వెంటనే సర్వే నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

04/04/2017 - 02:37

వేములవాడ రూరల్, ఏప్రిల్ 3: రాజన్న సన్నిధానంలో 11నెలల బాలుడు కిడ్నాప్ గురవ్వడం కలకలం రేపింది. అయతే కిడ్నాప్ గురైన 15 గంటల్లోనే పోలీసులు కిడ్నాప్ ఉదంతానికి తెరదించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు- నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కురంపల్లికి చెందిన వరాల ఉమాయాదగిరిల కుమారుడు వరుణ్ తేజ తలనీలాలు సమర్పించుకుంటామని వారు రాజన్నకు మొక్కుకున్నారు.

04/04/2017 - 02:35

తాండూరు, ఏప్రిల్ 3: దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను తమ ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు.

04/04/2017 - 02:34

హైదరాబాద్, ఏప్రిల్ 3: ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేసిన అనేక ప్రతిపాదనలున్నా వాటిని అమలుచేయడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ పేర్కొన్నారు. డొనేషన్లు, వన్‌టైమ్ ఫీజులుపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ట్యూషన్ ఫీజు నిర్ణయించడానికి ప్రాతిపదిక కూడా ఉందని తెలిపారు.

04/04/2017 - 02:34

హైదరాబాద్, ఏప్రిల్ 3: కెటిఆర్‌గారూ మా నాయకులతో, ప్రభుత్వంతో విసిగి పోయాం, ఆంధ్రలోనూ మీ పార్టీని ఏర్పాటు చేయండి అంటూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన శివకుమార్ కెల్ల ట్విట్టర్‌లో కెటిఆర్‌ను కోరారు. దీనికి కెటిఆర్ స్పందిస్తూ ‘తెలంగాణలో మాకు చాలా పని ఉంది బ్రదర్... మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఇటీవల కెసిఆర్ తిరుపతి పర్యటకు వెళ్లినప్పుడు స్థానికులు పెద్దసంఖ్యలో స్వాగతం పలికారు.

04/04/2017 - 02:33

హైదరాబాద్, ఏప్రిల్ 3: రైతులకు పెట్టుబడి సమకూర్చడం, దిగుబడులు పెంచడం, సరైన మద్దతు ధర కల్పించడం, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే బీమా కల్పించడం వంటి నాలుగు ముఖ్యమైన అంశాలు వ్యవసాయ రంగానికి అతి ముఖ్యమైనవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

04/04/2017 - 02:32

హైదరాబాద్, ఏప్రిల్ 4: బాబుగారూ ఇకపై నీతి, నిజాయితీ, నిప్పు అనే పదాలు వాడకండి, అవి మీకు ఏ మాత్రం సరిపోవు అంటూ పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన నలుగురికి బాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారని, మరి ఇదేం విలువలకు ప్రతీక అని ప్రశ్నించారు.

Pages