S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/04/2017 - 02:31

హైదరాబాద్, ఏప్రిల్ 3: వాసవి అకాడమి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయకపోవడంపై తెలంగాణ అడ్మిషన్స్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టిఎఎఫ్‌ఆర్‌సి) చైర్మన్ జస్టిస్ పి స్వరూపారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కమిటీ సభ్యులు 8 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

04/04/2017 - 02:30

గోదావరిఖని, ఏప్రిల్ 3: హిందూ చరిత్ర వేల సంవత్సరాలది... దీనిని ఎవరూ మరువద్దు... హిందుత్వాన్ని పరిరక్షించేందుకే విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించిందని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో నిర్మించిన విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి మందిర్ భవనాన్ని ఆయన సోమవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ...

04/04/2017 - 00:58

హైదరాబాద్, ఏప్రిల్ 3: వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీ నిర్వహిస్తున్న విటీ-2017 ప్రవేశపరీక్షకు 2.23 లక్షలదరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది ఈ ప్రవేశపరీక్షకు 2,12,238 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి అదనంగా 10,843 మంది దరఖాస్తు చేసుకున్నారని వర్శిటీ వ్యవస్థాపకుడు డాక్టర్ జి విశ్వనాధన్ తెలిపారు.

04/04/2017 - 00:57

హైదరాబాద్, ఏప్రిల్ 3: జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉత్పత్తుల పరిశ్రమలో రిటైర్డ్ అధికారులకు అవకాశం లభిస్తుంది. దాదాపు వంద మంది అధికారులను వివిధ ఉత్పత్తుల విభాగాల్లో నియమించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జైళ్ల సంస్కరణల్లో భాగంగా జైళ్లశాఖ పలు ఉత్పత్తులను, వ్యాపారాలను ప్రారంభించింది. ఇందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారంతోపాటు టోర్నోవర్ రూ. 296 కోట్లకు చేరింది.

04/03/2017 - 04:01

దేవరకొండ, ఏప్రిల్ 2: ముఖ్యమంత్రి కేసి ఆర్‌కు మిర్చి రైతుల ఉసురు తగలక తప్పదని పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మిర్చి రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు ఆదివారం ఆయన నేతృత్వంలో మల్లురవి, ఎమ్మెల్యే పద్మా ఉత్తమ్, డిసిసి అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ లతో కూడిన బృందం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయమార్కెట్‌ను సందర్శించింది.

04/03/2017 - 03:56

అయిజ, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రజా సమస్యలపై త్వరలోనే అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేపడుతున్నానంటూ తెలుగుదేశం పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్, శాసనసభ పక్షనేత ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా అధ్యక్షు డు రాంచంద్రారెడ్డి స్వగృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

04/03/2017 - 03:53

ఖమ్మం, ఏప్రిల్ 2: ‘నలభై ఏళ్ల క్రితం కాల్వకట్టల పక్కన, రోడ్ల వెంబడి తిరుగుతూ మొక్కలు నాటా. ఆనాడు నాటిన మొక్కలే ఈ వృక్షాలు. ఇవే నా నేస్తా లు. మనిషన్నాక ఏదోఒక మంచిపని చేయాలన్న తలంపుతో మొక్కలు నాటడం ఆరంభించా. ఆనాటి నుంచి చేస్తున్న కృషికి ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆ గొప్పతనమంతా ఈ వృక్షాలదే’ అని పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య అన్నారు.

04/03/2017 - 03:51

భద్రాచలం, ఏప్రిల్ 2: దక్షిణ అయోధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పెళ్లికి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ భక్తులు గోటితో వలిచిన కోటి తలంబ్రాలను ఆదివారం సమర్పించారు. వారు భక్తిప్రపత్తులతో రాసిన రామకోటి పుస్తకాలతో శోభాయాత్రగా వచ్చి వాటి ని దేవస్థానం ముఖ్య అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులుకు అందజేశారు.

04/03/2017 - 03:49

హైదరాబాద్, ఏప్రిల్ 2: లారీల సమ్మెతో ప్రజా జీవనంపై పెను భారం పడుతదున్నందున తక్షణమే కేంద్రంతో సంప్రదించి సమ్మెను ఆపించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం కెసిఆర్‌కు లేఖ రాశారు. నాలుగు రోజుల నుంచి లారీల సమ్మె జరుగుతున్నందున, లారీ యజమానులు పెట్టిన డిమాండ్లను చర్చించి పరిష్కరిస్తే బాగుంటుందని చాడ ఆ లేఖలో పేర్కొన్నారు.

04/03/2017 - 03:48

సంగారెడ్డి, ఏప్రిల్ 2: నాగరికత లేక కేవలం జంతువులను మాత్రమే వేటాడి కడుపు నింపుకుని జీవనం సాగించిన ఆదిమానవుడు నడియాడిన గుట్టలను పురావస్తు శాఖ అధికారులు సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్దుంపూర్ గ్రామ శివారులో గుర్తించారు. గ్రామానికి పశ్చిమ దిక్కున ఉన్న రాతి గుట్టలకు ఉన్న గుహలను చూసి తప్పకుండా ఈ ప్రదేశంలో ఆదిమానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే.

Pages