S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/31/2016 - 03:06

హైదరాబాద్, మార్చి 30: త్వరలో నూతన విద్యా విధానంపై సమగ్ర కార్యాచరణ విడుదల చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో హామీ ఇచ్చారు. విద్యా రంగంలో నిపుణులైన వారితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం అసెంబ్లీలో విద్యా విధానంపై స్వల్ప వ్యవధి ప్రశ్న కింద సుదీర్ఘంగా చర్చ జరిగింది.

03/31/2016 - 03:04

హైదరాబాద్, మార్చి 30:ఇ- కామర్స్‌లో ప్రపంచ దిగ్గజం గచ్చిబౌలిలో అతి పెద్ద క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమెరికాలోని క్యాంపస్ తరువాత ఇదే అతి పెద్ద క్యాంపస్. 10 ఎకరాల్లో ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. 2019 నాటికి ఇది పూర్తవుతుంది. క్యాంపస్ నిర్మాణానికి ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సెంటర్ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం లభించనుంది.

03/31/2016 - 03:02

హైదరాబాద్, మార్చి 30: రంగారెడ్డి జిల్లా పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం వ్యాను అదుపుతప్పి బోల్తా కొట్టింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి కొందూర్ మండలం ఉత్తరాస్‌పల్లికి పెళ్లి బృందం డిసిఎం వ్యాన్‌లో 65 మందితో బయలు దేరింది.

03/31/2016 - 03:00

హైదరాబాద్, మార్చి 30: ఇంటింటికి మంచినీరు, గుంటగుంటకు సాగునీరు అందించితీరుతామని, తెలంగాణలో కరవు సమస్య శాశ్వత పరిష్కారానికి ఇదొక్కటే మార్గమని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై శాసన సభలో బుధవారం జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ కరవు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

03/30/2016 - 18:22

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో పదెకరాల స్థలం చేపట్టే అమెజాన్ సంస్థ (ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ) కార్యాలయ భవన నిర్మాణాలకు తెలంగాణ ఐటీ శాఖామంత్రి కెటిఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు.

03/30/2016 - 16:52

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి బృందం వద్ద బుధవారం ఉదయం ఓ పెళ్లిబృందానికి చెందిన డిసిఎం వ్యాన్ బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి షాబాద్ మండలం ఉత్తరాస్‌పల్లికి వ్యాన్‌లో సుమారు 60 మంది వెళుతుండగా పరిగి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో ఇద్దరు, పరిగి ఆస్పత్రిలో ఇద్దరు, రాజేంద్రనగర్ ఆస్పత్రిలో ముగ్గురు మరణించారు.

03/30/2016 - 13:48

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలను ఒకే నెలలో రెండుసార్లు ‘డ్రా’ చేసుకున్నారని బుధవారం టి.అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘కాగ్’ నివేదికలో ఆక్షేపించారు. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు అధికంగా చూపినా, చాలా శాఖలో అందుకుతగ్గట్లుగా నిధులు ఖర్చు చేయలేదని, మరికొన్ని శాఖల్లో అవినీతి కారణంగా భారీగా ఆదాయం కోల్పోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

03/30/2016 - 13:50

హైదరాబాద్: తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను తక్కువగా నిర్ణయించడం పట్ల ‘కాగ్’ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన ‘కాగ్’ నివేదిక పలు ప్రభుత్వ శాఖల పనితీరుపై మండిపడింది.

03/30/2016 - 13:47

హైదరాబాద్: కరవు పరిస్థితులపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు జీవన్‌రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని తలసాని ధ్వజమెత్తారు. రైతుల గురించి తెలియని వారు కరవుపై మాట్లాడడం వింతగా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు.

03/30/2016 - 13:46

కరీంనగర్: ఇక్కడి బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం ఓ మహిళపై కొందరు ఆగంతకులు ఆకస్మికంగా దాడి చేసి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Pages