S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/02/2017 - 04:22

అయిజ, ఏప్రిల్ 1: గద్వాల జోగులాంబ జిల్లా అయజ మండల పరిధిలోని రాజాపురం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, సరస్వతీల కుమార్తె గీతారాణి గత ఆరు నెలలుగా భక్తిశ్రద్ధలతో, పట్టుదలతో 2,80,116 బియ్యపు గింజలపై శ్రీరామ అనే అక్షరా లు రాసింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారాముల కల్యాణం సందర్భంగా ముత్యాల తలంబ్రాలుగా వేస్తారు. గీతారాణి బియ్యపు గింజలపై శ్రీరామనామాలను లిఖించారు.

04/02/2017 - 04:20

సిద్దిపేట, ఏప్రిల్ 1 : కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని..ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని.. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవలం ఉనికి కోస మే తెలంగాణ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

04/02/2017 - 04:18

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణలో పోలీస్ బెటాలియన్లకు కొత్త కమాండెంట్లు నియమితులయ్యారు. హైదరాబాద్ యూ సుఫ్‌గూడ బెటాలియన్-1గా పనిచేస్తున్న జెఎస్ చౌహాన్ పదోన్నతిపై తెలంగాణ గ్రేహౌండ్స్ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. అదనపు సిఎంటి ఆక్టోపస్‌కు పనిచేస్తున్న సి సన్ని వరంగల్ జిల్లా మమ్నూర్ 4వ, బెటాలియన్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు.

04/02/2017 - 04:17

పటన్‌చెరు, మార్చి 1: వేల మంది పిల్లలకు పాఠాలు బోధించిన మాస్టారు అనాధ శవంలా మారారు. క్యాన్సర్ మహమ్మారితో తీవ్ర వ్యధను అనుభవిస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు కనికరించకపోవడంతో మనోవేదన మరింత అధికమైంది. శనివారం సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని విద్యాధికార్యాలయానికి వచ్చిన ఆయన కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు.

04/02/2017 - 02:49

హైదరాబాద్, ఏప్రిల్ 1: దేశంలో విద్యను ముఖ్యం గా బాలికల విద్యను ప్రోత్సహించాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తోందని, ఈ కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (సిఎబిఇ) సబ్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ సబ్ కమిటీ రెండో సమావేశం శుక్రవారం గౌహతిలో జరిగింది.

04/02/2017 - 02:48

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడవ ఏడాది కూడా రాష్ట్రం నుంచి వచ్చే సొంత పన్ను ఆదాయ వనరులు అంచనాకు తగ్గట్టుగా వసూలు కాలేకపోతున్నాయి. ఒక్క ఎక్సైజ్ ఆదాయం మినహాయిస్తే, మిగతా విభాగాల్లో ఆదాయం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి.

04/02/2017 - 02:47

హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వేసవిలో తాగునీటి పరిస్థితిపై జిల్లాల యంత్రాంగాలతో ఆయన సమీక్ష ప్రారంభించారు. శనివారం జరిపిన సమావేశంలో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో తాగునీటి పరిస్థితిపై సమీక్షించారు.

04/02/2017 - 02:45

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1: పట్టణంలోని శ్రీనివాస కాలనీలో శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు మోటారు సైకిళ్లపై వచ్చి నాగరాజు, విజయ్ అనే యువకులపై కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. ఈ ఘటన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇంటికి సమీపంలో చోటుచేసుకుంది.

04/02/2017 - 02:45

హైదరాబాద్, ఏప్రిల్ 1: అంతర్జాతీయ విద్యార్ధుల కొత్త బ్యాచ్ సమీకరణ కోసం ప్రసిద్ధి చెందిన పుల్టన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ బృందం భారత్‌కు శనివారం నాడు చేరుకుంది. ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీ పరిధిలోని ఈ కాలేజీ బృందం ఏప్రిల్ 11 వరకూ భారత్‌లో వివిధ పట్టణాల్లో పర్యటిస్తుంది. హైదరాబాద్‌లో ఏప్రిల్ 6వ తేదీన తాజ్ కృష్ణలో విద్యార్ధులకు ఇంటర్వ్యూలను ఇవ్వనుంది.

04/02/2017 - 02:44

హైదరాబాద్, ఏప్రిల్ 1: గోవధ, పశు మాంసం విక్రయాల విషయంలో బిజెపి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఆవును అమ్మగా పిలుస్తారని, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం రుచికరమైన మాంసంగా బిజెపి చూస్తున్నదని ఆయన శనివారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ విమర్శించారు.

Pages