S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/01/2017 - 09:07

సిద్దిపేట, మార్చి 31: మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా వేములగాట్ భూనిర్వాసితుల పోరాటం న్యాయమైంది, ధర్మమైందని, న్యాయం జరిగే దాకా పోరాటం ఆపవద్దని టిజెఎసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ సూచించారు. వేములగాట్ నిర్వాసితుల పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. న్యాయం కోసం 300రోజులుగా రిలేదీక్షలు చేయడం గొప్పవిషయమని, ఇదేస్ఫూర్తి కొనసాగించాలన్నారు.

04/01/2017 - 09:04

వరంగల్, మార్చి 31: రాష్ట్రంలో కొత్తగా మరిన్ని ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అవకాశం లేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం చేసారు. ఈ విషయంలో అటు ఏఐసిటిఇ, ఇటు జెఎన్‌టియు, ఉన్నత విద్యామండలి ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు.

04/01/2017 - 07:53

హైదరాబాద్, మార్చి 31: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ యాసంగిలో దాదాపు 19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయలో తీసిన పూడిక మట్టి వల్ల ఐదేళ్లలో రాని పంటల దిగుబడి గత ఖరీఫ్‌లో అధికంగా వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. యాసంగి లోనూ అద్భుతమైన ఫలితాలు రానున్నాయని చెప్పారు.

04/01/2017 - 07:51

హైదరాబాద్, మార్చి 31: తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు సమ్మెకు దిగడంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచి పోయాయి. దీంతో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా దెబ్బతిన్నది. చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం నుంచి లారీ యజమానుల అసోసియేషన్‌కు ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదు. శనివారం చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

04/01/2017 - 07:48

హైదరాబాద్ / చాంద్రాయణగుట్ట, మార్చి 31: నగరంలో పాత నోట్ల మార్పిడి ముఠాను పట్టుకుంటునే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్ కార్ఖాన ఐసిఐసిఐ బ్యాంక్ వద్ద పాత నోట్లు మార్పిడి కోసం యత్నిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.92 లక్షల 30 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు దక్షిణ మండలం డిసిపి సుమతి తెలిపారు.

04/01/2017 - 07:44

హైదరాబాద్, మార్చి 31: డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లను ఆన్‌లైన్ పద్ధతిలో చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుండి జూనియర్ కాలేజీల్లో సైతం ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపడతామని గత వారం ప్రకటించడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. మరో పక్క రాష్ట్రంలోని కార్పొరేట్ జూనియర్ కాలేజీలు పెద్ద ఎత్తున అడ్మిషన్లు చేపడుతున్నాయి.

04/01/2017 - 07:44

హైదరాబాద్, మార్చి 31: ఏ సమస్యలకైనా సమిష్టి కృషి, చర్చల ద్వారానే పరిష్కారం సులభతరం అవుతుందని బిజెపి జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి వి సతీష్‌జీ అన్నారు.

04/01/2017 - 02:08

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి రోజు రోజుకీ ఆగమైపోతోందని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు తెరాస ప్రభుత్వానికి పట్టవా అని నిలదీశారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడా నిలిచిన చరిత్ర లేదన్న సంగతి సిఎం కెసిఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శుక్రవారం సిఎం కెసిఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

04/01/2017 - 02:04

హైదరాబాద్, మార్చి 31: అడ్వకేట్ల సవరణ బిల్లు 2017ను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, తెలంగాణల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. భారత లా కమిషన్ చేసిన సిఫార్సుతో అడ్వకేట్ల చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అడ్వకేట్లు ప్రకటించారు. న్యాయవాద వృత్తికి విఘాతం కలిగించే అప్రజాస్వామిక చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

04/01/2017 - 02:03

హైదరాబాద్, మార్చి 31: దేశ పటంలో తెలంగాణ రాష్ట్ర పటం కనిపించడం లేదని ఎఐసిసి కార్యదర్శి వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి ఇదే నిదర్శనమని అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల మానవ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన భారత దేశ మ్యాప్‌లో తెలంగాణ మ్యాప్ కనిపించలేదని అన్నారు.

Pages