S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/31/2017 - 06:47

హైదరాబాద్, మార్చి 30: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువా రం శాసనమండలిలో ప్రమాణ స్వీకా రం చేశారు. మైనంపల్లి హనుమం తరావు, గంగాధర్‌గౌడ్, కృష్ణారెడ్డి, జనార్ధన్‌రెడ్డిలతో చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణం చేయంచారు. అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.

03/31/2017 - 06:43

హైదరాబాద్, మార్చి 30: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ తొలి సమావేశం గందరగోళం మధ్య వాయిదా పడింది.

03/31/2017 - 06:41

హైదరాబాద్, మార్చి 30:స్ర్తి నిధి ద్వారా ఈ సంవత్సరం 1810 కోట్ల రూపాయల వరకు రుణాలు మంజూ రు చేయాలని గురువారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో నిర్ణయించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. 1810 కోట్ల వార్షిక ప్రణాళికకు సమావేశంలో ఆమోదం తెలిపారు. గత సంవత్సరం వచ్చిన లాభంతో మూడు కోట్ల, 48 లక్షల, 16వేల రూపాయల డివిడెండ్‌ను ప్రభుత్వ డివిడెండ్‌గా ఇచ్చారు.

03/31/2017 - 06:40

హైదరాబాద్, మార్చి 30: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు.

03/31/2017 - 06:38

హైదరాబాద్, మార్చి 30: వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ గిరిజన బాలుడు మృతి చెందాడని, చనిపోయిన బాలుడి మృతదేహానికి చికిత్స చేశారంటూ గురువారం లక్డికాపూల్‌లోని లోటస్ ఆసుపత్రిపై బాధిత కుటుంబీకులు దాడి చేశారు. ఆసుపత్రి అద్దాలను పగులగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే 16ఏళ్ల బాలుడు మృతి చెందాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

03/31/2017 - 06:36

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏడాది పాటు కొనసాగనున్న నూతన కార్యవర్గంలో అదనపు డిజిపి (లాఅండ్‌ఆర్డర్) అంజనీకుమార్ కార్యదర్శిగా, అదనపు సిపి (అడ్మిన్) టి మురళీకృష్ణ కోశాధికారిగా ఎన్నికయ్యారు. డిఐజి, సిఐ సెల్ ఇంటెలిజెన్స్ రాజేష్‌కుమార్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

03/31/2017 - 06:28

హైదరాబాద్, మార్చి 30 : న్యాయస్థానాల్లో కోర్టు విచారణ సందర్భంగా కేవలం డాక్యుమెంట్లే ఆధారం కాదని, కేసు పూర్వపరాలతో పాటు లోతైన అధ్యయనం అవసరమని న్యాయవాదులు గుర్తించాలని భారత లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బి ఎస్ చౌహాన్ అన్నారు. ప్రపంచీకరణ ముప్పును అర్ధం చేసుకుని విదేశీ న్యాయవాదుల నుండి ఎదురయ్యే పోటీని తట్టుకునే రీతిలో న్యాయ విద్య సందర్భంగానే నైపుణ్యాన్ని పొందాలని ఆయన సూచించారు.

03/31/2017 - 06:27

హైదరాబాద్, మార్చి 30: హైదరాబాద్‌లోని బాలాపూర్ వద్ద దేవతల గుట్ట ప్రభుత్వ భూమిలో అక్రమంగా భవన నిర్మాణాలను చేపట్టారన్న అభియోగాలపై హైకోర్టు గురువారం సంచలనమైన నిర్ణయం ప్రకటించింది.

03/31/2017 - 06:26

హైదరాబాద్, మార్చి 30: నిరుద్యో గ యువతకు నైపుణ్య శిక్షణ ఇచేందుకు బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌స్ (ఐఐఎస్‌సి)తో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కోటి రూపాయల విరాళాన్ని కూడా బిడిఎల్ అందజేయనుంది. సోలార్ పివి, సిఎస్‌పి ఆధారిత ట్రైనింగ్, స్మార్ట్ మైక్రోగ్రిడ్‌ట్రైనింగ్‌ను యువతకు ఐఐఎస్‌సి అందించనుంది.

03/31/2017 - 06:25

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ మార్గాల నుంచి ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా, సంస్థ పరిధిలోని ఖాళీగా ఉన్న స్థలాలను వాణిజ్య అవసరాల కోసం లీజు ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంస్థ పరిధిలోని 28 ఖాళీ స్థలాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థకు 20 ఏళ్ల పాటు పెట్రోల్ బంకుల నిర్వహణకు నెలవారి అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Pages