S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/31/2017 - 00:58

నల్లగొండ, మార్చి 30: తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు నేడో రేపో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి ఎన్నికల కమిషన్‌కు బాధ్యతలు అప్పగించనుందని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రతి ఎంపి స్థానంలో కొత్తగా రెండు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముందన్నారు.

03/31/2017 - 00:51

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు గురువారం నాడు పూర్తికాగానే మూల్యాంకనానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు 5,38,226 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. ఇందులో రెగ్యులర్ విద్యార్ధులు 5,09,831 మంది కాగా, గతంలో పరీక్షలు రాసి ఫెయిలైన వారు 28,395 మంది రాశారు.

03/31/2017 - 00:51

హైదరాబాద్, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం చూస్తే టీచర్లు ఎక్కువగానే ఉన్నారని కేంద్రప్రభుత్వం తేల్చింది. జాతీయ స్థాయిలో సైతం ఈ నిష్పత్తి సరిపడా ఉందని మానవ వనరుల మంత్రిత్వశాఖ పేర్కొంది.

03/31/2017 - 00:50

హైదరాబాద్, మార్చి 30: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై పెంపుదలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 31వ తేదీ శుక్రవారం నిర్ణయం ప్రకటించనుంది. ఈ నిర్ణయాన్ని ఏపిఇఆర్‌సి కార్యాలయంలో చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ప్రకటిస్తారు.

03/30/2017 - 05:40

హైదరాబాద్, మార్చి 29: కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, అంచనాలు పరిశీలిస్తే వృద్ధిరేటులో తెలంగాణ 21 శాతంతో దేశంలోనే మొదటిస్థానంలో నిలుస్తోందని సిఎం కె. చంద్రశేఖరరావు అన్నారు. హేమలంబ ఉగాది వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నివాస ప్రాంగణం ‘ప్రగతిభవన్’లో బుధవారం అట్టహాసంగా జరిగాయ. కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడుతూ పంచాంగ శ్రవణంలో చెప్పిన అంశాలు సైన్స్ కూడా చెప్పాయని గుర్తు చేశారు.

03/30/2017 - 05:38

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణలో హెచ్‌ఐవి రోగుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది ఎయిడ్స్ కేసుల నమోదు పరిశీలిస్తే, రాష్టవ్య్రాప్తంగా ఏడుశాతం పెరగగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 33 శాతం హెచ్‌ఐవి ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. అధికారిక వివరాల ప్రకారం 2015లో 1,61,552 మంది హెచ్‌ఐవి బారిన పడగా, 2016లో వీరి సంఖ్య (జనవరి 2017 నాటికి) 1,73,398కు చేరింది. మొత్తంగా 11,846 కొత్త కేసులు నమోదయ్యాయి.

03/30/2017 - 05:37

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ పంట పండింది. సకాలంలో వర్షాలు, రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన వార్షిక వ్యవసాయ ప్రణాళికకు అనుగుణంగా రైతులు పంటలను వేయడం, సాగునీటి సద్వినియోగం వల్ల రికార్డు స్ధాయిలో దిగుబడి అందునుందని తెలంగాణ ఆర్ధిక, గణాంకాల శాఖ డైరెక్టరేట్, ప్రణాళిక శాఖ ప్రకటించింది.

03/30/2017 - 05:34

హైదరాబాద్, మార్చి 29: వరుస వివాదాలతో పరువు తీస్తున్న గాంధీ ఆస్పత్రిపై ఎట్టకేలకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. బుధవారం గాంధీ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆర్‌ఎంఓ సర్వస్వతిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు సరెండర్ చేస్తున్నట్టు ప్రకటించారు.

03/30/2017 - 05:26

హైదరాబాద్, మార్చి 29: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా ఒకేరోజు మూకుమ్మడిగా ముఖ్యమంత్రితో సమావేశం కావడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. వీరంతా టిఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారేమోనన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

03/30/2017 - 05:25

ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి 18 లక్షల ఎకరాలకు నీరు
తెలంగాణ, ఆంధ్రకు సరిపడా జలాలున్నాయి
ఎవరితో పేచీలేకుండా సస్యశ్యామలం చేసుకోవచ్చు
జిల్లా నేతలకు ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా
పాలమూరు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో భేటీ

Pages