S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/08/2017 - 04:46

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ శాసనమండలికి టీచర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల కోసం నియామకం అయిన సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికలు జరిగే వివిధ జిల్లాల్లో పనిచేసే అధికారుల జాబితాను రూపొందించారు. ఎన్నికల సమయంలో అవసరమైతే తక్షణమే నిర్ణయం తీసుకునేందుకు మెజిస్టీరియల్ అధికారాలు వీరికి ఉండాలి.

03/08/2017 - 04:45

న్యూఢిల్లీ, మార్చి 7: మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పైపులైన్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి ఝాను కోరారు. ఎస్‌పి సింగ్ మంగళవారం ఝాతో సమావేశమై మిషన్ భగీరథకు అటవీ శాఖ అనుమతుల గురించి చర్చించారు.

03/08/2017 - 04:44

హైదరాబాద్, మార్చి 7: శాసన సభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు ముగ్గురు మంగళవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. మూడు స్థానాలకు ముగ్గురి నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం వల్ల వీరి ఎన్నిక లాంచనప్రాయంమైంది. మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు నామినేషన్ దాఖలు చేశారు.

03/08/2017 - 02:22

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ అవతరించి మూడేళ్లవుతున్నా మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వని సిఎం కెసిఆర్ మహిళల అభ్యున్నతి అంటూ ఇచ్చిన హామీలను ఎవరు నమ్ముతారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళల నాయకత్వం, వారి సామర్థ్యం పట్ల కెసిఆర్‌కు విశ్వాసం లేదన్నారు.

03/08/2017 - 02:20

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో ఏటేటా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతున్నాయని రాష్ట్ర సలహా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలతో 2015-16లో 522 మంది, 2016-17 తొలి ఆరు నెలల్లో 292 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. విద్యుత్ పంపిణీ సంస్థల నిర్వహణ లోపాల వల్ల అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని సలహా సంఘం అభిప్రాయపడింది.

03/08/2017 - 02:18

హైదరాబాద్, మార్చి 7: వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగబోయే ఐపిఎల్ మ్యాచ్‌ల పర్యవేక్షణకు అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాల్సిందిగా బిసిసిఐ హైకోర్టును కోరింది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిందిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను ఆదేశించాల్సిందిగా నగరానికి చెందిన న్యాయవాది ఎం.

03/08/2017 - 02:12

సిద్దిపేట, మార్చి 7: సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం విషయం పై కేసు నమోదు చేయకపోవడంతో నిలదీసిన ఒక వికలాంగుడిని ఎస్‌ఐ చితకబాదాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలం మామిడ్యాలకు చెందిన బల్ల లక్ష్మణ్ వికలాంగుడు. గతనెల 23న తన నాన్నమ్మ ఇంట్లో దొంగలు పడి బంగారు నగలు చోరీ అయ్యాయ.

03/07/2017 - 05:08

కామారెడ్డి, మార్చి 6: బంగారు తెలంగాణ అంటూ ప్రజాధనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

03/07/2017 - 05:07

హైదరాబాద్, మార్చి 6: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సాగునీటి ప్రాజెక్టుల డిజైనింగ్, రీడిజైనింగ్‌లో కాంట్రాక్టర్ల పాత్రపై న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. అనేక ఆరోపణలు వస్తున్న మిషన్ కాకతీయ పనులపైనా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

03/07/2017 - 05:06

హైదరాబాద్, మార్చి 6: తెలంగాణలోని మదర్సాల నిధుల గోల్‌మాల్‌పై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మహబూబ్‌నగర్‌లో డిఇవోగా ఉన్న సమయంలో సోమిరెడ్డి నకిలీ మదర్సాలకు నిధులు కేటాయించారంటూ వచ్చిన అభియోగాలపై సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని 32 మదర్సాలు ఉండగా వీటిలో 16 మదర్సాలకు 2014-15 విద్యాసంవత్సరానికి గాను రూ. 50 లక్షలు, 2015-16 సంవత్సరానికి రూ. 20 లక్షల నిధులు మంజూరయ్యాయి.

Pages