S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/07/2017 - 02:20

హైదరాబాద్, మార్చి 6: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడి కార్యకర్తలను ఇక నుంచి టీచర్లుగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారికంగా ప్రకటన వెలువడింది. అంగన్‌వాడీ టీచర్లకు వేతనాన్ని 7,500 రూపాయల నుండి 10,500 రూపాయలకు పెంచాలని, కార్యకర్తలకు 4,500 నుండి ఆరువేల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు.

03/07/2017 - 02:19

హైదరాబాద్/ ఖైరతాబాద్, మార్చి 6: నిరుద్యోగ సమస్యపై పోరాటం ఆపేది లేదని, వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని టి.జెఎసి చైర్మన్ కోదండరామ్ తెలిపారు. తెలంగాణ విద్యార్థి సంఘాల జెఎసి సోమవారం నిరుద్యోగ సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.

03/06/2017 - 07:55

నల్లగొండ, మార్చి 5: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఆదివారం స్వామివారు జగన్మోహిని అలంకార సేవలో అశ్వవాహన రూఢుడై భక్తులను పులకింపచేశారు. ఉదయం 10గంటలకు స్వామివారికి జగన్మోహినిగా అలంకార సేవ, రాత్రి 9గంటలకు ఆశ్వవాహన సేవలను నిర్వహించారు.

03/06/2017 - 07:54

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించేందుకుగాను ఈ నెల 6న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు టిపిసిసి ఉపాధ్యక్షు డు మల్లు రవి తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా- కోయిల్‌సాగర్ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.

03/06/2017 - 07:46

హైదరాబాద్, మార్చి 5: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేర రహిత హైదరాబాద్ కోసం షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం 5కె, 2కె రన్ జరిగింది.

03/06/2017 - 07:44

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రూ.80వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుపై పర్యావరణ అధ్యయనం చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అంగీకరించింది. పర్యావరణ అధ్యయనం కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను త్వరలో కేంద్ర పర్యావరణ శాఖ ఖరారు చేయనుంది. కేంద్ర పర్యావరణ శాఖ శనివారం ఢిల్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై రాష్ట్ర సాగునీటి నిపుణులతో చర్చించింది.

03/06/2017 - 07:43

హైదరాబాద్, మార్చి 5: యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ ముసాయిదా బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రణాళికను డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ రూపొందించింది.

03/06/2017 - 07:43

హైదరాబాద్, మార్చి 5: శాసనమండలిలోని ఖాళీలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటా, గవర్నర్ కోటా కింద తమ పార్టీ అభ్యర్థులుంటారని, స్థానిక సంస్థల కోటా కింద ఖాళీ అయిన స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి వదిలిపెట్టినట్టు సిఎం ప్రకటించారు.

03/06/2017 - 07:42

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణ జెఎసి భవిష్యత్తుపై కమిటీ సభ్యుల్లో ఆందోళన ఆరంభమైంది. టిజాక్ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా అవతరిస్తుందా? లేక జెఎసి చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ మరో రాజకీయ పార్టీలోకి వెళ్ళనున్నారా? అలా వెళితే జెఎసి భవిష్యత్తు ఏమవుతుంది? కొత్తగా ఎవరైనా బాధ్యత స్వీకరించి ముందుకు నడిపిస్తారా.. జాక్ అంతర్ధానమవుతుందా?

03/06/2017 - 07:42

హైదరాబాద్, మార్చి 5: రాజ్‌భవన్ ప్రాంగణంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నివాసాల కోసం నిర్మించిన భవన సముదాయాలకు ఆదివారం ఉదయం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవం చేశారు. 2.70 ఎకరాల విస్తీర్ణంలో 152 ఫ్లాట్ల నిర్మాణానికి గతేడాది ఫిబ్రవరి 17 శంకుస్థాపన చేయగా రికార్డు స్థాయిలో 13 నెలల వ్యవధిలోనే వాటిని పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.

Pages