S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/15/2017 - 02:24

హైదరాబాద్, ఫిబ్రవరి 14: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి పెద్దమొత్తంలో నిధులు రాబట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వివిధ శాఖాధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం సంబంధిత అధికారులతో ఎస్‌పి సింగ్ సమీక్షించారు.

02/15/2017 - 02:23

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వాణిజ్య సంస్థలు, కంపెనీలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక, ఇతర ట్రస్టులలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు, కార్మికులకు 2015-16 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన వారికి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు చెల్లిస్తున్నట్టు కార్మిక శాఖ సహాయ కమిషనర్ టి.శేషంరాజు తెలిపారు.

02/15/2017 - 02:22

హైదరాబాద్, ఫిబ్రవరి 14: జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిపి) కింద కూలీలకు ఎండాకాలంలో పనిభారం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ పేరుతో మంగళవారం ఒక జీఓ జారీ అయింది. ఎండాకాలంలో పగటివేళ ఎక్కువగా ఎండలో ఉండటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని, అందువల్ల పనిభారం తగ్గించాలని నిర్ణయించారు.

02/15/2017 - 02:21

హైదరాబాద్, ఫిబ్రవరి 14: మున్ముందు విద్యుత్ ఛార్జీలు పెంచే విషయంపై ప్రభుత్వం ఆచితూచి అడుగువేస్తోంది. ఛార్జీల పెంపునకు విముఖత చూపిస్తోంది. ఒకవేళ పెంచినా నామమాత్రంగానే ఉండాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే నష్టాలు చవిచూస్తున్న డిస్కంలకు సబ్సిడీ కేటాయింపులు భారీగా పెంచి గట్టెక్కించాలే తప్ప ఛార్జీల జోలికి ప్రభుత్వం వెళ్లదని తెలుస్తోంది. తెలంగాణ విద్యుత్ డిస్కంలకు వచ్చే ఏడాదికి భారీ ఎత్తున రూ.

02/14/2017 - 04:54

కరీంనగర్, ఫిబ్రవరి 13: తెలంగాణలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని తెరాస సర్కారు అమలు చేయాలని టిజెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.

02/14/2017 - 04:52

ప్రవాహంలా తరలివస్తున్న భక్త జనసందోహంతో గొల్లగట్టు జాతర కిక్కిరిసిపోయింది. ఆదివారం అంతంతమాత్రంగా ఉన్న భక్తజనం సోమవారం పోటెత్తింది. లింగా.. ఓ లింగా.. అంటూ భక్తులు పారవశ్యంతో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే సోమవారం సుమారు 8 లక్షల మంది తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
**

02/14/2017 - 04:49

మహబూబాబాద్, ఫిబ్రవరి 13: చదువుతున్నది 3వ తరగతే.. కానీ ఆ చిన్నారి జ్ఞాపకశక్తి అపూర్వం. ప్రపంచపటంలో 236 దేశాలను కేవలం 2.38 సెకన్ల వ్యవ ధిలో గుర్తించి ఆ చిన్నారి అతిధులను అబ్బురపరచడమే కాక, రెండు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది.

02/14/2017 - 05:09

ఖైరతాబాద్/హైదరాబాద్, ఫిబ్రవరి 13: వకుళమాత ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పూనుకోవడం హర్షణీయమని శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వ్యవస్థాపకులు పివిఆర్‌కె.ప్రసాద్, సమరసత్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మాజీ ఛీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావులతో కలిసి ఆయన మాట్లాడారు.

02/14/2017 - 03:17

పటాన్‌చెరు, ఫిబ్రవరి 13: అన్నదాతలు ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని ఐటి శాఖ మంత్రి తారకరామారావు పిలుపునిచ్చారు. మన దేశంలో అత్యధిక సంఖ్యాకులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నప్పటికీ ఇతర దేశాల మాదిరిగా వృద్ధిని నమోదు చేయడం లేదన్నారు.

02/14/2017 - 03:10

హైదరాబాద్, ఫిబ్రవరి 13: యాదగిరిగుట్ట పట్టణాభివృద్ధి సంస్థ (వైటిడిఎ) లో ఐదు కారిడార్లు ఉండబోతున్నాయి. యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఉన్న ఏడు రెవెన్యూ గ్రామాలు ఈ అథారిటీ పరిధిలోకి వచ్చే విధంగా బృహత్ ముసాయిదా ప్రణాళికను రూపొందించారు.

Pages