S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/14/2017 - 03:19

హైదరాబాద్, ఫిబ్రవరి 13: గురుకుల పాఠశాలల్లో వెంటనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విధించిన నిబంధనలు లక్షల మంది విద్యార్థుల జీవితాలను అంధకారం చేసేలా ఉన్నాయని పేర్కొంటూ ఎస్‌ఎఫ్‌ఐ సహా పలు విద్యార్థి సంఘాల నేతలు సోమవారం రాష్టవ్య్రాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. పలు జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

02/14/2017 - 03:05

హైదరాబాద్, ఫిబ్రవరి 13: అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ నెల 14వ తేదీ నుండి 21 వరకూ చైనాలో పర్యటించనున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 36 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

02/14/2017 - 03:03

హైదరాబాద్, ఫిబ్రవరి 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పలు వివాదాలకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావును తొలగించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత , రాజ్యసభ్య సభ్యుడు వి హనుమంతరావు హైకోర్టులో ప్రజావాజ్య పిటీషన్‌ను దాఖలు చేశారు.

02/14/2017 - 03:03

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమాచారాన్ని తెలంగాణ సమాచార శాఖ ఎప్పటికప్పుడు పత్రికలు, మీడియాకు అందిస్తున్న తీరు ప్రశంసనీయమని మహారాష్ట్ర సమాచార శాఖ డైరక్టర్ అజయ్ అంబేకర్ అన్నారు.

02/14/2017 - 03:02

నక్కలగుట్ట (వరంగల్) ఫిబ్రవరి 13: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి కుమారుడు వంశీరెడ్డి అమెరికా కాలిఫోర్మియాలో ఆగంతకుని కాల్పులలో మృతి చెందిన విషయం విదితమే. సోమవారం సంజీవరెడ్డి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో పలువురు నాయకులను కలసి వంశీరెడ్డి మృతదేహాన్ని త్వరగా తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని కోరారు.

02/14/2017 - 03:02

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఇంజనీరింగ్ విద్యార్థుల ఉత్తీర్ణత రోజురోజుకూ తగ్గి 22 శాతానికి పడిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లుగా తెలంగాణ పరిధిలో లక్షన్నర మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. అయితే వీరిలో 20వేల మందికి మించి ఉత్తీర్ణులు కావడం లేదని ఇటీవలి లెక్కలు తేలుస్తున్నాయి. దీనికి జెఎన్‌టియు అమలు చేస్తున్న మూల్యాంకన పద్ధతులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.

02/14/2017 - 03:01

హైదరాబాద్, ఫిబ్రవరి 13:‘ తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదు, ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకుంటున్నారు, ఇలాంటి బ్రోకర్లతో చర్చలేంటి?’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు టిటిడిపి నేతలపై మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్య, ఎం. భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

02/14/2017 - 02:19

హైదరాబాద్, ఫిబ్రవరి 13: అడ్డుకట్ట లేకుండా రేషన్ వస్తువుల అక్రమ రవాణా జరుగుతున్నదని, రేషన్ బియ్యాన్ని బొక్కేస్తున్నారని ఇలా రకరకాల శీర్షికలతో పత్రికల్లో వార్తలు రావడం, దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదలు, విమర్శలు, ఆరోపణలకు దారి తీయడం చూస్తున్నాం.

02/14/2017 - 02:17

బొంరాస్‌పేట, ఫిబ్రవరి 13: కడదాక తోడుందామని బాసలు చేసుకున్నారు. కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో అది ఫలించలేదు.. వారి ప్రేమను విధి వక్రీకరించింది. ప్రేమ జంటను విడదీయాలని అమ్మాయికి మేన బావతో పెళ్లి కూడా చేశారు. దాంతో వారు మృత్యువును కౌగిలించుకున్నారు. తమ ఇష్టదైవమైన శ్రీకృష్ణస్వామి దేవాలయం పక్కనే గల కృష్ణగిరి గుట్టల్లో ప్రేమికులు సోమవారం తనువు చాలించారు.

02/14/2017 - 02:13

సంగారెడ్డి, ఫిబ్రవరి 13: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో తెరాసకు గట్టిపోటీ ఇచ్చిన టిడిపి తన పట్టును నిలుపుకునేందుకు మరోమారు కసరత్తు ప్రారంభించింది. తెరాస సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు టిడిపి నిర్వహిస్తున్న ప్రజాపోరు గర్జనకు గజ్వేల్ వేదికగా నిలుస్తోంది.

Pages