S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/13/2017 - 02:05

హైదరాబాద్/శంషాబాద్, ఫిబ్రవరి 12: బంగారం స్మగ్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అబుదాబి నుంచి ఓ ప్రయాణికుడు తన కాలి బూట్లలో (షూస్) కిలోన్నర బంగారు బిస్కెట్లను పెట్టుకుని వస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కి నాలుగు రోజులు గడవనైనా లేదు, తాజాగా ఆదివారం ఉదయం ఓ ప్రయాణికుడు ఎల్‌ఈడి బల్బుల్లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు.

02/13/2017 - 01:48

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 12: ఉచిత వైఫై గ్రామంగా ఇబ్రహీంపూర్‌ను తీర్చిదిద్దినట్లు తెలంగాణ నీటి పారుదలశాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మండలంలోని ఇబ్రహీంపూర్‌లో ఆదివారం సాయంత్రం పంచాయతీ భవనం, అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటిసారిగా ఉచిత వైఫై గ్రామంగా ఇబ్రహీంపూర్‌లో సేవలందిస్తున్నట్లు తెలిపారు. వైఫైతో గ్రామంలో యువతకు అధునాతన టెక్నాలజీ అందిస్తున్నామన్నారు.

02/13/2017 - 01:44

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ‘ప్రాజెక్టుల నిర్మాణం పేరిట కాంట్రాక్టర్లు, కొంత మంది రాజకీయ నాయకులు జేబులు నిండడం కాదు నీటితో రైతుల పొలాలు నిండాలి..’ అని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గోదావరి నీటి సద్వినియోగంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన తెలిపారు.

02/13/2017 - 01:44

హైదరాబాద్, ఫిబ్రవరి 12: హైదరాబాద్ పరిసరాలు, జలాశయాల పరిరక్షణకు మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన 111 జీవో భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ జీవోను ప్రభుత్వం సడలిస్తే పర్యావరణ విధ్వంసం జరుగుతుందని మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు వాదిస్తుంటే, మరో వైపు అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రజలు మాత్రం జీవోలోని నిబంధనలు గుదిబండలా తయారయ్యాయంటున్నారు.

02/13/2017 - 01:39

హైదరాబాద్, ఫిబ్రవరి 12: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అఖిల భారత రోడ్డు రవాణా వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. ఇందుకు తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఆదివారం నాడిక్కడ ఇందిరాపార్కు వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా రంగ కార్మికుల రాష్ట్ర సదస్సు జరిగింది.

02/13/2017 - 01:39

హైదరాబాద్, ఫిబ్రవరి 12: పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు అరుట్ల సుశీలాదేవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ఆదివారం నాడిక్కడ ఎఐటియుసి కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

02/12/2017 - 09:16

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తల్లిదం డ్రుల ముద్దు ముచ్చట్లతో ఆడు తూ.. పాడుతూ.. చదువుకోవాల్సిన చిన్నారులు రాష్ట్ర సరిహ ద్దులు దాటాల్సి వచ్చింది. పిడికెడు మెతుకుల కోసం చిన్నారుల బా ల్యం వెల్డింగ్ షాపులు, వస్త్ర దుకాణాలు, సైకిల్ స్టోర్లు, పరిశ్రమల్లో కరిగిపోతోంది. మోయలేని పనిభారంతో రోజూ నరక యాతన అభవిస్తున్న బాలకార్మికు లు ప్రతి ఏటా పెరిగిపోతున్నారు.

02/12/2017 - 09:15

వరంగల్, ఫిబ్రవరి 11: స్వచ్ఛ సర్వేక్షణ్-2017 సర్వేలో భాగంగా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కేటగిరిలో గ్రేటర్ వరంగల్ నగరం దేశవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది. మొదటి పదిస్థానాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛత యాప్‌లో దేశవ్యాప్తంగా పాల్గొన్న 500 నగరాలలో వరంగల్ 42వ స్థానంలో నిలచింది.

02/12/2017 - 09:14

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అక్రమాలకు పాల్పడినా, ఓటర్లను ప్రలోభ పెట్టెందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు.

02/12/2017 - 09:14

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అక్రమాలకు పాల్పడినా, ఓటర్లను ప్రలోభ పెట్టెందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు.

Pages