S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/12/2017 - 09:14

వరంగల్, ఫిబ్రవరి 11: దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ మండలం మల్కాపూర్ వద్ద ప్రతిపాదించిన రిజర్వాయన్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లింగంపల్లి గ్రామప్రజలు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని అడ్డుకుని నిరసన తెలిపారు.

02/12/2017 - 09:13

హైదరాబాద్, ఫిబ్రవరి 11: దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన జాతీయ సైనిక కళాశాల (ఆర్‌ఐఎంసి)కి తెలంగాణ విద్యార్థి సిహెచ్.అవినాష్ ఎంపికయ్యా రు. రక్షణ రంగంలో చేరి దేశానికి సేవలు అందించాలనుకునే వారికి విద్యార్థి దశలోనే బలమైన పునాది వేసే ఈ కళా శాలలో ప్రవేశాలకు జాతీయ స్థాయి లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

02/12/2017 - 09:13

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఎయిమ్స్ తరహాలో తెలంగాణకు సెంట్రల్ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునాని దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూనాని మెడిసిన్ విభాగం ఆవరణలో కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపద్ యశోనాయక్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం మొక్కలు నాటారు.

02/12/2017 - 08:55

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పది జాతీయ బ్యాంకులు రూ.7,400 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు ఈ రుణాలను సమకూర్చారు. వీటిలో ఆంధ్రా బ్యాంకు రూ.1,300 కోట్లు మంజూరు చేయగా, కెనరా బ్యాంకు రూ.1,000 కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు రూ. 1,000 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ.

02/12/2017 - 08:52

చొప్పదండి/గంగాధర, ఫిబ్రవరి 11: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైనుకు గేట్ వాల్ తెరవడంతో దాదాపు 40 ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. చెరువులు నింపేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైనుకు అక్కడక్కడ గేట్‌వాల్‌లు ఏర్పాటు చేశారు. అయితే, ఇంతకుముందే గుండి చెరువుకు వచ్చే గేట్‌వాల్ తీయగా చెరువు పూర్తిగా నిండింది.

02/12/2017 - 08:51

హైదరాబాద్, ఫిబ్రవరి 11: దేశంలో నిరుద్యోగ యువత పేర్లను నమోదు చేసుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలుగా ఇక మీదట పోస్ట్ఫాసులూ పనిచేయనున్నాయి. ఇందుకోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల నమూనాను మార్చి నేషనల్ కెరీర్ సర్వీసులుగా రూపొందించారు. ఇవి ఇపిఎఫ్‌ఒ పెన్షనర్లకు జీవన్ ప్రమాణ్ ఫెసిలిటీ కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి.

02/12/2017 - 08:49

హైదరాబాద్, ఫిబ్రవరి 11: సాటి వ్యక్తికి సహాయం చేయబోయిన పాతబస్తీ యువకుడు హబీబ్ మహమ్మద్ దుబాయ్‌లో జైలుపాలైన ఉదంతమిది. వివరాల్లోకి వెళ్లే.. హబీబ్ ఇంటికి సమీపంలో నివసిస్తున్న ఒక వ్యక్తి తమ బంధువులకు కీళ్లనొప్పుల మందులు తీసుకెళ్లాలంటూ ఒక పెట్టెను ఆయనకు ఇచ్చాడు. తీరా హబీబ్ దుబాయిలో దిగగానే ఆ పెట్టెను పరిశీలించిన అధికారులు అందులో నిషేధిత మందులు ఉన్నట్లు గుర్తించారు.

02/12/2017 - 08:47

సూర్యాపేట, ఫిబ్రవరి 11: తెలంగాణలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర ఆదివారం రాత్రి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ జాతరకు తరలిరానున్నారు.

02/12/2017 - 02:53

హైదరాబాద్, ఫిబ్రవరి 11: బౌద్ధమత గురువు దలైలామా శనివారం సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీని సందర్శించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ ఎం బహుగుణ దలైలామాను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దలైలామా పోలీస్ అకాడమీ సిబ్బంది, కుటుంబీకులతో ముచ్చటించారు. అకాడమీలో అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద ఆయన అమరవీరులకు నివాళులర్పించారు.

02/12/2017 - 02:51

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్రంలో రైతులను స్వయం సమృద్ధి వైపు నడిపిస్తున్నామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ (జీడిమెట్ల)లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఇ)లో ‘పోర్టబుల్ సోలార్ మైక్రో కోల్డ్‌రూం’ను శనివారం ఆయన ఆవిష్కరించారు.

Pages