S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/12/2017 - 02:05

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణలో టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి. అదే సమయంలో టిఆర్‌ఎస్ పార్టీ పథకాల ద్వారా తన పునాదులు మరింత పటిష్ఠ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉభయ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఉద్యోగ నియామకాల అంశం ఆధారంగానే టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం కావడం విశేషం.

02/12/2017 - 02:03

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రెండేళ్లలో తెలంగాణలో ప్రభుత్వం ఊహించని అభివృద్ధి సాధించిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఊహించని మార్పు తీసుకు వచ్చినట్టు తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడుతున్నామని అన్నారు.

02/11/2017 - 04:56

హైదరాబాద్, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లో శ్వాసకోశ నిపుణులు (పల్మనాలజీ), డయాబెటిక్, కీళ్ల వ్యాధి నిపుణులు (రుమాటిక్స్) వద్ద బాధితుల అపాయింట్‌మెంట్‌లు విపరీతంగా పెరిగాయని హెల్త్‌కేర్ మ్యాప్ ఇండియా రెండవ ఎడిషన్ సర్వే లో వెల్లడయింది. శ్వాసకోశ నిపుణులతో అపాయింట్‌మెంట్లలో 39 శాతం, మధుమేహ నిపుణులతో 38 శాతం, కీళ్ల వ్యాధి నిపుణులతో అపాయింట్‌మెంట్లలో 30 శాతం పెరుగుదల నమోదైంది.

02/11/2017 - 04:55

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 59ను సవరిస్తూ రెవిన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 500 చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణకు ఉన్న అవకాశాన్ని 1000 చదరపు గజాల వరకు సవరిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎజి గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

02/11/2017 - 04:53

హైదరాబాద్, ఫిబ్రవరి 10: అరుదైన కాలేయ వ్యాధి ‘విల్సన్ డిసీజ్’తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు అపోలో హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. జన్యుపరమైన వ్యాధి గా గుర్తించి మృత్యువుతో పోరాడుతున్న బాలుడు టి.సిద్ధార్థ రెడ్డికి చికిత్స చేశామని వైద్యులు తెలిపారు.

02/11/2017 - 04:53

హైదరాబాద్, ఫిబ్రవరి 10: నీలోఫర్ ఆస్పత్రిలో ఒకేసారి ఐదుగురు బాలింతలు మరణించిన సంఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓపై వేటు వేసింది. నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్, ఆర్‌ఎంఓ ఉషారాణిలపై వేటు వేశారు. వీరిద్దరినీ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్‌కు సరెండర్ చేశారు. గురువారం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.

02/11/2017 - 04:51

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10: ఫీల్డ్ అసిస్టెం ట్ మృతికి అధికారులే కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులతో పాటు ఏకంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధర్నాకు దిగారు. దీంతో శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

02/11/2017 - 04:57

హైదరాబాద్, ఫిబ్రవరి 10: 2008 డిఎస్సీలో నియమితులైన వారందరి సర్వీసులను క్రమబద్ధీకరించాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. జస్టిస్ పివి సంజీవకుమార్, జస్టిస్ ఎన్ బాలయోగిలతో కూడిన డివిజన్ బెంచ్ మూడు పిటిషన్ల విచారణను ముగిస్తూ, ఈ తీర్పును ఇచ్చారు. డిఇడి అభ్యర్థులకు 30 శాతం పోస్టులను కేటాయించడాన్ని అభ్యర్థులు సవాలు చేశారు.

02/11/2017 - 02:49

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఫిబ్రవరి 10: కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం బహిరంగ చర్చ జరిగింది. గత కొన్ని రోజులుగా పాలమూరు లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చ జరిపారు.

02/11/2017 - 02:46

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రాజకీయాలకు అతీతంగా దళితులు, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రెండు కమిటీ ల సభ్యులను కోరారు. వన్ ఆఫ్ 2013 చట్టం పేరు మార్చడమేగాక, చాప్టర్లు, క్లాజులు చాలా మార్పులు చేయాల్సిన నేపథ్యంలో కొత్తచట్టమే మంచిదని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టంపై లోతైన చర్చ అవసరమని కమిటీలు నిర్ణయించాయి.

Pages