S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/08/2017 - 04:05

హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణలో 40 చేపల మార్కెట్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో మార్కెట్‌కు 10 లక్షల రూపాయల చొప్పున 405 లక్షల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేపల అభివృద్ధి పథకంలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులు గ్రాంటుగా మంజూరు చేశారు.

02/08/2017 - 04:04

నిజామాబాద్, ఫిబ్రవరి 7: నిజామాబాద్ జిల్లా బోధన్ సిటిఓ కార్యాలయం కేంద్రంగా వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న నకిలీ చలానాల కుంభకోణం కేసును ప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించాలని నిర్ణయించింది.

02/08/2017 - 04:03

జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 7: అక్క, చెల్లెళ్ల్ల మధ్య గొడవ ప్రాణం మీదకు తెచ్చింది. తాను దాచుకున్న సొమ్మును, చెల్లి, తమ్ముడు తరుచూ తీసుకుంటున్నారని గొడవపడిన అక్క రూ.10 కోసం తీవ్ర మనస్తాపం చెంది వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం అంతర్గాం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

02/08/2017 - 04:03

హైదరాబాద్, ఫిబ్రవరి 7:రాష్ట్రంలో 180 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా, ఇప్పటి వరకు 150 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం పూర్తయింది. భువనగిరి మార్కెట్ కమిటీ, సిద్దిపేట మార్కెట్ కమిటీ పాలక వర్గాలను మంగళవారం నియమించారు. భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ధరావత్ పంతులు నాయక్‌ను నియమించారు. సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వేముల వెంకట్‌రెడ్డిని నియమించారు.

02/08/2017 - 04:02

సిద్దిపేట, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెండు వేలమంది వైద్యులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఆరో గ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ వెల్లడించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం విలేఖరులతో ఆమె మాట్లాడారు.

02/08/2017 - 03:22

హైదరాబాద్, ఫిబ్రవరి 7: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్పులతో రాష్ట్రానికి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు సాధించేందుకు తెలంగాణ మంత్రులు తమ శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో బడ్జెట్‌లో రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు కేటాయించే వారు. అయితే ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రాల ప్రస్తావనే తీసుకు రాలేదు. ఆయా శాఖలకు నిధులు కేటాయించారు.

02/08/2017 - 03:21

హైదరాబాద్, ఫిబ్రవరి 7: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండువేల కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో నాలుగు లక్షల కుటుంబాలకు 75శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేయనుంది. దీని కోసం ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందిస్తోంది.

02/08/2017 - 03:21

హైదరాబాద్, ఫిబ్రవరి 7: నీలోఫర్ ఆస్పత్రిలో ఒకేరోజు ఐదుగురు బాలింతలు మరణించిన సంఘటనపై ప్రభుత్వం ఐఏఎస్ విచారణకు ఆదేశించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ రాహుల్ బొజ్జాకు విచారణ బాధ్యత అప్పగించారు. నీలోఫర్ ఘటనపై ఇప్పటికే అంతర్గత విచారణ జరిగింది. ముగ్గురు సభ్యుల విచారణకు డిఎంఇ ఆదేశించారు.

02/08/2017 - 03:20

హైదరాబాద్, ఫిబ్రవరి 7: బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం ‘సేవాస్తంభ్’ (ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్) గత ఐదు దశాబ్దాల నుండి పోరాటం చేస్తోందని తెలంగాణ ప్రెస్‌క్లబ్ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. సేవాస్తంబ్ రూపొందించిన 2017 డెస్క్ క్యాలండర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు.

02/08/2017 - 03:20

హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్‌లో బాంబులు అమర్చి విధ్వంసానికి పాల్పడాలని కుట్రపన్నిన 8మంది ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులు ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాద్యమాలను ఉపయోగించరాదని, దీనివల్ల పోలీసులకు దొరికిపోయే అవకాశాలు ఉన్నాయని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన సానుభూతిపరులను ఆదేశించింది. వీరిపైన కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) ఈ వివరాలను పేర్కొంది.

Pages