S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/04/2017 - 04:54

గుర్రంపోడు, ఫిబ్రవరి 4: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు తెగబ డ్డారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనేపల్లి గ్రామానికి చెందిన దామోర మోజేష్ (30) శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

02/04/2017 - 04:54

నర్వ, ఫిబ్రవరి 3: విధి నిర్వహణలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చి అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో వాటిని అధిగమించి బస్టాం డ్ కూడలిలో ఎపి 22 0095 బస్సును నిలుపుదల చేసి బస్సులోనే డ్రైవర్ స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచిన విషాద సంఘటన వనపర్తి జిల్లా నర్వ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

02/04/2017 - 04:37

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేరగాళ్లు, తీవ్రవాద, ఉగ్రవాద అనుమానితుల కదలికలను పసిగట్టి, వారిని వెంటనే పట్టుకునేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ హబ్ (ఐపిఐహెచ్) డాటా బేస్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ తరహా డాటా బేస్‌ను హైదరాబాద్‌లో రూపొందించారు.

02/04/2017 - 04:36

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతుండడంతో వేసవి కాలం వచ్చేసినట్లు ఉంది. రోజు రోజుకీ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వేసవిలో అడుగుపెడుతున్నట్లు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటోంది. మరోవైపు చలి తీవ్రత కూడా ఈ రోజుల్లో సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి వెళ్లే వరకు చలి తీవ్రత సాధారణంగా కొనసాగుతుంది.

02/04/2017 - 02:13

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ప్రస్తుత తెరాస సర్కార్ సహా గత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో దారిమళ్లించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆయా శాఖలకు ప్రస్తుతం కేటాయించిన నిధుల నుంచి వెనక్కి రప్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.

02/04/2017 - 02:12

హైదరాబాద్, ఫిబ్రవరి 3: జాతీయ స్థాయిలో పౌరసేవలు అందించే సిఎస్‌ఎఫ్‌ఐ పురస్కారానికి రాష్ట్ర రవాణా శాఖ ఎంపికైందని ఆ శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సర్వీసెస్ ఇండియా (సిఎస్‌ఐ) ఈ పౌరసేవా పురస్కారాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, జాతీయ ప్రభుత్వ శాఖలకు సంస్థ అందించే పౌరసేవల పురస్కారంలో అన్నింటిని పక్కకు పెట్టి రవాణా శాఖ అవార్డును గెలుచుకుంది.

02/04/2017 - 02:12

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో వివిధ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి భారీగా నిధులు సాధిస్తామని అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. త్వరలోనే ఒక బృందం ఢిల్లీ వెళుతుందని, నిధుల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.

02/04/2017 - 02:11

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మద్యం షాపుల నుంచి 15 శాతం సర్వీసు టాక్స్ వసూలు చేయాలని సెంట్రల్ ఎక్సైజు బోర్టు అండ్ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిలుపుదల చేస్తూ హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. తమ నుంచి సర్వీసు టాక్స్ వసూలు చేయాలన్న ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇరు రాష్ట్రాలకు చెందిన మద్యం షాపుల యజమానులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

02/04/2017 - 02:11

హైదరాబాద్, ఫిబ్రవరి 3: జాతీయ జెండాను అవమానించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిపై (1971 చట్టం ప్రకారం) చర్య తీసుకోవాలని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు ఆయన శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

02/04/2017 - 02:09

హైదరాబాద్, ఫిబ్రవరి 3: హోండా మోటార్స్ ఇండియా యంగ్ ఇంజనీర్లు- సైంటిస్టుల అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డు కింద 3వేల అమెరికన్ డాలర్లు స్కాలర్‌షిప్ వారికి లభిస్తుంది.

Pages