S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/11/2020 - 01:34

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ చిత్రా రామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు చేశా రు. ఉదయం 8 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒం టిపూట బడులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం ము గిసేవరకు వచ్చే నెల ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయ ని పేర్కొన్నారు.

03/10/2020 - 05:53

హైదరాబాద్, మార్చి 9: హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం నాడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. వెంటనే సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని వైద్యుల బృందం దత్తాత్రేయకు పలు పరీక్షలు నిర్వహించారు. దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి జేఎండీ సంగీత రెడ్డి చెప్పారు.

03/10/2020 - 05:51

సికిందరాబాద్, మార్చి 9: గాంధీ ఆసుపత్రికి రోజురోజుకి కోవిడ్ అనుమానిత లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో భయాందోళనలు రెట్టింపు కావటంతో జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా గాంధీలోని కోవిడ్ వార్డుకు చేరుకుంటున్నారు. ఇందులో ట్రావెల్ హిస్టరీ లేని వారిని గుర్తించి వారికి వైద్యులు కౌనె్సలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు.

03/10/2020 - 05:50

హైదరాబాద్, మార్చి 9: పబ్‌లో జరిగిన దాడిలో గాయాల పాలైన బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ మద్దతు పలికారు. ఈ మేరకు ఇద్దరు కలిసి సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను కలిశారు. తనకు న్యాయం చేయాలని రాహుల్ మంత్రి కేటీఆర్‌ను కూడా కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రకాష్‌రాజ్ చీఫ్ విప్‌ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.

03/10/2020 - 05:27

మిర్యాలగూడ, మార్చి 9: మారుతీరావును చనిపోయేవరకు ఉరి తీయాలని డిమాండ్ చేసిన అమృత ఇప్పుడు డబ్బు కోసం డ్రామాలు ఆడుతోందని మృతుడు మారుతీరావు తమ్ముడు తిరునగరు శ్రవణ్ ఆరోపించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తండ్రి చనిపోతే శుభవార్త అన్న అమృత మారుతీరావు చనిపోయాక ఆయనకున్న ఆస్తిపైన ప్రేమతోనే లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు.

03/10/2020 - 05:25

మిర్యాలగూడ, మార్చి 9: మారుతీరావు ఆత్మహత్య చేసుకొని మృతి చెందేంత పిరికివాడు కాదని ఆయన కుమార్తె అమృతప్రణయ్ అన్నారు.

03/10/2020 - 05:12

మిర్యాలగూడ, మార్చి 9: పట్టణానికి చెందిన మారుతీరావు అంత్య క్రియలు సోమవారం బంధుమిత్రులు, స్థానికుల ఆశ్రునయనాల మధ్య జరిగాయ. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో కూతురు అమృత భర్త పెరుమాళ్ల ప్రణయ్‌ను సుఫారీ ఇచ్చి హత్య చేయించిన కేసులో ఏ వన్ నిందితుడైన మారుతీరావు హైద్రాబాద్‌లో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.

03/10/2020 - 05:09

హైదరాబాద్, మార్చి 9: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావువిషం తీసుకోవడం వల్లే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

03/10/2020 - 05:06

కరీంనగర్, మార్చి 9: గత రెండు మూడు రోజుల నుంచి ఎవరి ఫోన్‌కు కాల్ చేసినా రింగ్ కంటే ముందుగానే ఓ పెద్ద దగ్గు శబ్దం వినిపిస్తోంది. తర్వాత దగ్గు ఆగగానే అర్థం కాని భాషలో మాటలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ నివారణకు ప్రచారమా? అప్రమత్తంగా ఉండాలంటూ సందేశమా? ఏమో తెలియదు కానీ ఏ ఫోన్‌కైనా కాల్ చేస్తే చాలు ముందుగా దగ్గు శబ్దం, ఆ తరువాత అర్థం కాని భాషలో మాటలు వినిపిస్తున్నాయి.

03/10/2020 - 05:05

బొమ్మలరామారం, మార్చి 9: ముగ్గురు బాలికల హత్యాచార నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసేంత వరకు పండుగలను నిర్వహించుకోబోమని భువనగిరి జిల్లా బొమ్మలురామారం మండలం హాజీపూర్ గ్రామ బాధిత కుటుంబాలు తెలిపాయ.

Pages